సరయు అవుట్ – హౌస్ లో హంగామా

గత వారం అట్టహాసంగా మొదలైన బిగ్ బాస్ 5లో ఎలిమినేషన్ ప్రక్రియ మొదలయ్యింది. అందరూ ఊహించినట్టే సరయుకి సెలవు చెప్పేశారు. ఈ విషయం శనివారమే లీకైపోయి సోషల్ మీడియాలో ప్రచారం జరిగిపోవడంతో ఎవరు వెళ్తారా అనే దాని గురించి పెద్దగా సస్పెన్స్ కలగలేదు. ఇక నాగార్జున ఎప్పటిలాగే తనదైన స్క్రీన్ ప్రెజెన్స్ తో మరోసారి అదరగొట్టేశాడు. ఫస్ట్ పెట్టిన ఎలిమినేషన్ లిస్ట్ లో యాంకర్ రవి, ఆర్జె కాజల్, మానస్, హమీద, జెస్సీ, సరయు తదితరులు ఉన్నారు. ఇందులో ఇద్దరు మొన్నే సేఫ్ అయ్యారు. జెస్సీని మినహాయించి మిగిలిన 18 మందిని తొమ్మిది జంటలుగా చేసి వాళ్ళతో ర్యాంపు వాకులు, డాన్సులు గట్రా ఆడించారు.

అందరిలోకి ప్రియాంకా శ్వేతా వర్మలు మాత్రమే నాగ్ జెస్సీ ఇద్దరి దగ్గరా 10 మార్కులు కొట్టేశారు. యాపిల్ పండ్లు కోసే టాస్కు పెట్టి మానస్ ని ఎలిమినేషన్ నుంచి కాపాడారు. ఆ తర్వాత నేను మీకు తెలుసా అనే మరో గేమ్ స్టార్ట్ అయ్యింది. జంటలుగా విడగొట్టి వాళ్ళ మధ్య రహస్యాలను బయటికి తీసుకొచ్చే ప్లాన్ అన్న మాట. దీంట్లో కాజల్ సేవ్ అయ్యింది. ఇక ఫైనల్ గా జెస్సీ సరయు ఇద్దరే మిగలగా ఎవరు బయటికి వెళ్లాలో నిర్ణయించేందుకు సైకిళ్లను తెప్పించారు. జెస్సీ సైకిల్ లైట్ వెలగడంతో సరయుకు డేంజర్ బెల్ మ్రోగింది. ఒక్కసారిగా విశ్వ చిన్నపిల్లాడిగా మారిపోయి కన్నీళ్ల వర్షం కురిపించేశాడు.

ఇక బయటికి వచ్చాక సరయు నాగ్ సూచనల మేరకు బెస్ట్ అయిదు వరస్ట్ అయిదుగురు గురించి చెప్పమనడంతో ఆమె మాములుగా రెచ్చిపోలేదు. శ్వేత, ప్రియాంక, విశ్వా, హమీద, మానస్ ల మీద సాఫ్ట్ కార్నర్ చూపించిన సరయు సిరి, సన్నీ, లహరి, షన్ను, కాజల్ ల మీద కామెంట్ల వర్షం కురిపించేసింది. ఇదంతా అన్ని సీజన్లలో జరిగే వ్యవహారమే అయినప్పటికీ ఎలిమినేట్ అయ్యే వాళ్ళు పండించే డ్రామా ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. అలా మొత్తానికి ఫస్ట్ వీక్ ఎపిసోడ్స్ పూర్తి చేసిన బిగ్ బాస్ సరయుకి గుడ్ బై చెప్పేశాడు. ఇవాళ్టి నుంచి యథావిధిగా ఎలిమినేషన్లు మళ్ళీ మొదలవుతాయి. రాబోయే ఆదివారం ఇద్దరు బయటికొచ్చే ఛాన్స్ ఉందని టాక్

Also Read: న్యాచురల్ స్టార్ కి పరీక్షా సమయం

Show comments