iDreamPost
iDreamPost
బడా నిర్మాత బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి వచ్చిన బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఓ మోస్తరుగా సెటిలయ్యాడు కానీ ఇంకా గొప్పగా చెప్పుకునే బ్లాక్ బస్టర్ అయితే అందలేదు. ఒక్క రాక్షసుడు మాత్రం సూపర్ హిట్ క్యాటగిరీలో పడింది కానీ అది రీమేక్ కావడం, థ్రిల్లర్ జానర్ లో హీరోయిజం లేకుండా వేరే అంశాలతో మెప్పించడం లాంటి కారణాల వల్ల పూర్తి క్రెడిట్ తీసుకోలేకపోయాడు. అయినా ఫలితంతో సంబంధం లేకుండా సాయిశ్రీనివాస్ కు డబ్బింగ్ మార్కెట్ బాగుంది. ఒక్క హిందీ వెర్షన్ కే పది కోట్లకు పైగానే ధర పలుకుతుందట. యుట్యూబ్ లో మిలియన్ల వ్యూసే దానికి సాక్ష్యం. ఆ కారణంగానే డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీతో ఛత్రపతి రీమేక్ చేస్తున్నాడు.
ఇక విషయానికి వస్తే ఇతని తమ్ముడు బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యంతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఎప్పుడో షూటింగ్ పూర్తయినా ఫైనల్ గా ఇప్పుడు విడుదల కుదిరింది. అక్టోబర్ 5న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. కాకపోతే అదే రోజు చిరంజీవి గాడ్ ఫాదర్, నాగార్జున ది ఘోస్ట్ లు ఆల్రెడీ షెడ్యూల్ అయ్యున్నాయి. అయినా కూడా సాహసం చేయడం విచిత్రం. ఆ రెండింటికే థియేటర్ల కేటాయింపు పెద్ద సమస్యగా ఉంటుంది. పైగా దానికి ముందు వారం పొన్నియన్ సెల్వన్ వచ్చి ఉంటుంది. అది దిల్ రాజు సమర్పణ కాబట్టి స్క్రీన్లను అంత సులభంగా తగ్గించరు. 29న ధనుష్ నేనే వస్తున్నాని అల్లు అరవింద్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మరి ఇంత రిస్క్ ఎందుకు చేస్తున్నట్టో
స్వాతిముత్యం నిర్మాతలు సితార ఎంటర్ టైన్మెంట్. పవన్ కళ్యాణ్ ఆత్మీయ మిత్రుల సంస్థ ఇది. ఈ ఏడాది భీమ్లా నాయక్, డీజే టిల్లులతో మంచి లాభాలు అందుకున్నారు. మరి గణేష్ ని లాంచ్ చేస్తున్నప్పుడు సోలోగా ఉండేలా ప్లాన్ చేసుకోవాలి ఇంత పెద్ద క్లాష్ లో దించడం అనూహ్య నిర్ణయమే. అలా అని ఇదేదో కనివిని ఎరుగని కథేమీ కాదని టీజర్ చూశాక అర్థమయ్యింది. సింపుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తీశారు. ఇంత కాన్ఫిడెంట్ గా ఎందుకు ఉన్నారో సినిమా చూశాకే క్లారిటీ వస్తుంది. ఇదింకా రిలీజ్ కాకుండా గణేష్ మరో మూవీ నేను స్టూడెంట్ సర్ చిత్రీకరణ పూర్తి చేసుకుని అప్పుడే పోస్ట్ ప్రొడక్షన్ కు వెళ్ళింది. మరో రెండు మొదలయ్యేందుకు రెడీ అవుతున్నాయి