Tasty Teja- Shobha Shetty: వీడియో: ఇదేం ట్విస్టు స్వామీ.. టేస్టీ తేజా గుండెలపై శోభాశెట్టి పచ్చబొట్టు!

వీడియో: ఇదేం ట్విస్టు స్వామీ.. టేస్టీ తేజా గుండెలపై శోభాశెట్టి పచ్చబొట్టు!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 హౌస్ ఇప్పుడు జిలేబిపురం, గులాబిపురంలా మారిపోయింది. అందరూ గ్రహాంతరవాసులను ఇంప్రెస్ చేసేందుకు తెగ కష్టపడిపోతున్నారు. ఎవరికి వాళ్లు.. వాళ్లకి ఇచ్చిన క్యారెక్టర్లలో బాగానే ఎటర్ టైన్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి జరిగింది. అదేంటంటే టేస్టీ తేజా గుండలపై శోభాశెట్టి పచ్చబొట్టు. ఎంటి ఫ్యూజులు ఎగిరిపోయాయా? తేజ గుండెల మీద శోభా శెట్టి పచ్చబొట్టు ఏంటి అనుకుంటున్నారా?

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో దోస్త్ మేరా దోస్తులు అంటే టక్కున శోభా శెట్టి, టేస్టీ తేజ అనే చెప్తారు. వాళ్లు కలిసే తినడం, కలిసే తిరగడం, కలిసే ఆడటం కూడా చేస్తున్నారు. నిజానికి శోభాని గెలిపించడానికి తేజ చాలానే కష్టపడుతున్నాడు. ఆమెకు హౌస్ లో ఎంత నెగిటివిటీ ఉందో.. బయట కూడా అంతే నెగిటివిటీ ఉంది. అలాంటిది ఆమె ప్రవర్తనను మార్చేందుకు తేజ చాలానే కష్టపడుతున్నాడు. అయితే అది అర్థం చేసుకోకపోగా.. శోభాశెట్టి రివర్స్ లో తేజా మీదే కేకలు వేయడం చూశాం. నీలో మంచి, చెడు చూసుకో ఫస్ట్ అంటూ గట్టిగానే క్లాస్ పీకింది.

అంత చేసినా కూడా తేజ మాత్రం తన ఫ్రెండ్ ని మార్చుకునేందుకు చాలానే ట్రై చేస్తున్నాడు. ఆఖరికి ఆమె నామినేషన్ కూడా చేసింది. అయినా చాలా మంచి మనసుతో ఆమె నామినేషన్ ను తీసుకున్నాడు. అందుకు శోభా మాత్రం పాయింట్ ఉంటే నామినేట్ చేయకుండా ఎలా ఉంటాను అని చెప్పుకుంది. తర్వాత ఎలాగో ఇద్దరూ సెట్ అయిపోయారు. ఇప్పుడు వీళ్లిద్దరికి బిగ్ బాస్ గట్టిగానే షాకిచ్చాడు. ఇద్దరికి అనే బదులు.. తేజాకి అని చెప్పాలి. ఎందుకంటే టేస్టీ తేజాని తన గుండెలపై శోభాశెట్టి పచ్చబొట్టు వేయించుకోమని చెప్పారు. అది విన్న తేజాకు మాటల్లేవు. బిగ్ బాస్ పచ్చబొట్టు ఏంటి? నాకు అసలే పెళ్లి కూడా కాలేదు అంటూ ఏడుపు మొదలు పెట్టాడు. మొదట అందరూ ఇదంతా జోకు అనుకున్నారు. ఎందుకంటే ఈ సీజన్ లో బిగ్ బాస్ గట్టిగానే జోకులు వేస్తున్నాడు. అందరూ అదే అనుకున్నారు. కానీ, పెద్ద ట్విస్టు ఇస్తూ శోభా శెట్టి పేరుని ఏ డిజైన్ లో వేయించుకుంటారు అంటూ కొన్ని డిజైన్స్ కూడా హౌస్ లోకి పంపారు.

ఇదంతా చూసిన తర్వాత శోభాశెట్టి కూడా షాకుతింది. నిజంగానే ఇప్పుడు టాటూ వేస్తారా అంటూ నోరెళ్లబెట్టింది. తేజా అయితే కెమెరాలను బతిమాలుకుంటూ కనిపించాడు. ప్లీజ్ బిగ్ బాస్ ఫ్రెండ్ షిప్ వరకు ఓకేగానీ, ఈ టాటూలు ఏంది అంటూ రిక్వెస్ట్ చేసుకున్నాడు. కానీ, బిగ్ బాస్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. అయితే నిజంగానే ఆ టాటూ వేయించే ఆస్కారం తక్కువగా ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే ఏ సీజన్ లో కూడా ఇలాంటి టాస్కు పెట్టలేదు. బిగ్ బాస్ లోగో అయితే కచ్చితంగా వేయిస్తారు అనుకోవచ్చు. కానీ, లేడీ కంటెస్టెంట్ పేరుని ఇలా వేయించలేదు. ఒకవేళ వేసినా కూడా టెంపరరీ టాటూ వేసే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇదంతా టేస్టీ తేజాను ఆట పట్టించడానికే అనిపిస్తోంది. మరి.. తేజ గుండెలపై శోభా టాటూ వేయించుకోమని చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments