P Venkatesh
P Venkatesh
డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తోన్న నిరుద్యోగులకు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ శుభవార్తను అందించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాళీగా ఉన్న 6160 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి ఇది గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. ఎంపికైన వారికి సంవత్సరం వరకు అప్రెంటిషిప్ ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15000 చొప్పున చెల్లిస్తారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 01 నుంచి 21 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో కోరింది. ఆసక్తి గల అభ్యర్థులు SBI అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ వివరాల కొరకు అధికారిక వెబ్‌సైట్ sbi.co.in నుంచి పొందవచ్చును. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 500 కు పైగా పోస్టులు ఉన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బ్యాంక్: ఎస్బీఐ
పోస్టులు: 6,160
తెలుగు రాష్ట్రాల్లో:
తెలంగాణకు 125, ఆంధ్రప్రదేశ్ కు 390 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉత్తీర్ణత, ఆగస్టు 1, 2023 నాటికి అభ్యర్థి తప్పనిసరిగా నేషనల్ అప్రెంటిస్‌షిప్ ప్రమోషన్ స్కీమ్ (NAPS) ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.రిజర్వ్ డ్ కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 300. SC/ST/PwBD కేటగిరీల అభ్యర్థులు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తు ప్రారంభ తేదీ: సెప్టెంబర్ 1, 2023
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 21, 2023
రాత పరీక్ష: అక్టోబర్/నవంబర్ 2023
అధికారిక వెబ్ సైట్:
https://sbi.co.in/
రిక్రూట్‌మెంట్ లింక్:
https://ibpsonline.ibps.in/sbiaaug23/