భాగ్యనగరిలో రూ. కోటికి పైగా ధర పలికిన గణపతి లడ్డు.. ఎక్కడంటే?

వినాయక చవితి మొదలైన నాటి నుంచి నిమజ్జనం వరకు పట్టణాల నుండి పల్లెటూర్ల వరకు పండుగ వాతావరణం నెలకొంటుంది. వినాయకుడి బొమ్మను ప్రతిష్టించి, నైవేద్యం సమర్పించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఆ తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు భక్తులు. బొమ్మను నెలకొల్పినన్ని రోజులూ పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. ఇక నిమజ్జనం రోజు చెప్పనక్కర్లేదు. డీజే హోరులు, అదిరిపోయే మాస్ స్టెప్పులతో ఊరేగిస్తూ నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తారు. అయితే అంతకుముందు లడ్డూ వేలం వేస్తారు. ఈ కార్యక్రమం కూడా కనుల పండుగగా జరుగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన కార్యక్రమం భారీగా జరుగుతుందన్న విషయం తెలిసిందే.

అలాగే ఇక్కడ వినాయకుడికి ప్రసాదంగా పెట్టే లడ్డూలకు కూడా గిరాకీ ఉంటుంది. నిమజ్జనం ముందు ఈ లడ్డూలను వేలం వేస్తారు. దీన్ని సొంతం చేసుకునేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. ఇప్పుడు ఓ లడ్డు రికార్డు స్థాయిలో ధర పలికింది. హైదరాబాద్ బండ్లగూడ పరిధిలోని రిచ్ మండ్ విల్లాలోని గణపతి లడ్డూ రూ. కోటి 26 లక్షలు పలికింది. గత ఏడాది ఇక్కడ లడ్డు రూ. 60.80 లక్షలకు పాడారు. అంటే ఈ ఏడాది సుమారు రెండింతలు ఎక్కువ ధర పలికిందన్న మాట. అలాగే మాదాపూర్ మై హోం భుజాలో ఏర్పాటు చేసిన వినాయక లడ్డు కూడా 25.50 లక్షలకు పలకడం విశేషం. గత ఏడాది వేలంలో రూ. 18.50 లక్షలకు పోగా.. ఈ ఏడాది 7 లక్షలు అధికంగా ధర పలికింది. దీన్ని చిరంజీవి గౌడ్ అనే వ్యక్తి పాడారు. అలాగే బాలాపూర్ లడ్డూ కూడా 27 లక్షలు పలికింది. ఈ లడ్డూ ధరతో ఒక లగ్జరీ ఇల్లు కొనుక్కోవచ్చు. కానీ భక్తి ముందు ఈ ఇళ్ళు, పొలాలు అన్నీ జుజుబీ. మరి రియల్ ఎస్టేట్ మాదిరి లడ్డూల ధర పలుకుతుండడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments