iDreamPost
android-app
ios-app

ఆర్ఆర్ఆర్ గురించి సస్పెన్స్ ట్వీట్

  • Published Jan 19, 2020 | 3:37 AM Updated Updated Jan 19, 2020 | 3:37 AM
ఆర్ఆర్ఆర్ గురించి సస్పెన్స్ ట్వీట్

ఇవాళ ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ కం ట్రేడ్ రిపోర్టర్ తరణ్ ఆదర్శ్ పెట్టిన ట్వీట్ సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. సౌత్ లో బాగా పేరున్న ఒక బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సినిమా వాయిదా పడబోతోందని దసరాకు పోస్ట్ పోన్ చేసేలా ప్లానింగ్ జరుగుతోందని అందులో పేర్కొన్నాడు. ఇంత ప్రత్యేకంగా చెప్పాడంటే అది ఖచ్చితంగా రాజమౌళి మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ గురించే అని చరణ్ తారక్ ఫ్యాన్స్ ఇప్పటికే ఓ కంక్లూజన్ కు వచ్చేశారు. అది ఏ సినిమానో తరణ్ మాత్రం చెప్పలేదు. 

ఒకరకంగా చూస్తే అది ఆర్ఆర్ఆర్ గురించే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇంకా షూటింగ్ పూర్తవ్వలేదు. ఒకవేళ అయ్యే ఛాన్స్ ఉంటే ఈపాటికి ఏదో ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేవాళ్ళు. కనీసం అప్ డేట్ కూడా ఈమధ్య కాలంలో ఇవ్వడం లేదు. కాబట్టి ఆర్ఆర్ఆర్ గురించే అని సమాచారం.  జక్కన్న కాకుండా సౌత్ నుంచి బాలీవుడ్ లో దర్శకత్వం వహిస్తున్నది ఒక్క గౌతమ్ తిన్ననూరి మాత్రమే.  అది కూడా జెర్సి రీమేక్. అదేమీ చరిత్ర సృష్టించిన సినిమా కాదు. 
సో తరణ్ ఇంత ప్రత్యేకంగా ఇతని గురించి అయితే చెప్పి ఉండడు. పోనీ కబీర్ సింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అనుకుంటే ఇంకా స్క్రిప్ట్ ఫైనల్ కాలేదు కాబట్టి విడుదల గురించి మాట్లాడే ఛాన్స్ లేదు. సో ఇది ఆర్ఆర్ఆర్ గురించే. అక్టోబర్ అంటే దసరా పండగ టైంలో. గత ఏడాది అదే సమయంలో సైరా వచ్చింది. ఈసారి ఆర్ఆర్ఆర్ వస్తుందేమో. అధికారికంగా ఇప్పట్లో తరణ్ చెప్పింది ప్రకటించే అవకాశం లేకపోవచ్చు.  ముందు చెప్పిన జూలైకి కేవలం ఆరు నెలలే టైం ఉంది. పబ్లిసిటీ విషయంలో చాలా ప్లాన్డ్ గా ఉండే రాజమౌళి సైలెంట్ గా ఉన్నాడు అంటే ఆర్ఆర్ఆర్ వాయిదా దాదాపు పక్కానే.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişHoliganbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişHoliganbet Girişmadridbet güncel girişmadridbet