జనవరి 1న 67,385 శిశువుల జననం… !

  • Published - 07:58 AM, Fri - 3 January 20
జనవరి 1న 67,385 శిశువుల జననం… !

జనవరి 1… ఆ రోజుకి ఉండే ప్రత్యేకతే వేరు..! కొత్త సంవత్సరంలో తొలిరోజు కావడంతో అందరూ ఉత్సాహంగా గడుపుతారు..! ఐతే జనవరి 1నే పుట్టిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? రెండు పండుగలు ఒకేసారి వచ్చినట్టు గాల్లో తేలిపోరూ..! ఇదంతా ఎందుకంటే మొన్న మనమంతా నూతన సంవత్సరాన్ని ఘనంగా జరుపుకున్నాం..అదే రోజు మనదేశంలో అక్షరాలా 67,385 మంది నవజాత శిశువులు జన్మించటం విశేషం..!

ప్రపంచంలోనే టాప్..

జనవరి1న భారత్ లో మొత్తం 67,385 పిల్లలు జన్మించగా, ప్రపంచవ్యాప్తంగా 3,92,078 పిల్లలు పుట్టినట్లు యునిసెఫ్‌ పేర్కొంది. భారత్‌తోపాటు మరో ఏడు దేశాల్లో జన్మించిన శిశువులు.. ప్రపంచవవ్యాప్తంగా పుట్టిన పిల్లల సంఖ్యకు సగంగా నమోదు కావడం విశేషం. చైనా 46,299, నైజిరియా 26,039, పాకిస్తాన్ 6,787, ఇండోనేషియా 13,020, అమెరికా 10,452, రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో 10, 247, ఇథియోపియా
8,493 మంది పిల్లలు జన్మించారని యునిసెఫ్‌ పేర్కొంది. ఇదే తీరు కొనసాగితే త్వరలో భారత్‌ జనాభా చైనాను దాటుతుందని అంచనా వేసింది. 2019 జూన్‌లో ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనాభా నివేదికలో ఇండియా జనాభా.. వచ్చే దశా‍బ్దకాలంలో చైనాను అధిగమిస్తుందని చెప్పిన సంగతి తెలిసిందే.

భారత్ లో 2018, జనవరి 1న ఇంతకంటే ఎక్కువ స్థాయిలో నవజాత శిశువులు జన్మిచారు. గతేదాడి వివరాలను చూస్తే భారత్ లో 69,070, చైనాలో 44,760, నైజీరియాలో 22,210, పాకిస్థాన్ లో 14,910, ఇండోనేషియాలో 13,370, అమెరికాలో 11,280, బంగ్లాదేశ్ లో 8,370 మంది శిశువులు జన్మించారు. ఐతే 2018లో జన్మించిన వారిలో 2.5 మిలియన్‌ శిశువులు మొదటి మాసంలోనే మరణించారని యునిసెఫ్‌ వెల్లడించింది. ఆ పిల్లలంతా ప్రసవ సమయంలో వచ్చే సమస్యలు, అంటు వ్యాధులతో మృతి చెందారని తెలిపింది. గత మూడు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఐదు సంవత్సరాలలోపు మృతి చెందుతున్నపిల్లల సంఖ్య సగానికి తగ్గినట్లు పేర్కొంది.

Show comments