Rathika Rose Re-Entry Into Bigg Boss House: బిగ్ బాస్ హౌస్ లోకి రతికా రోజ్ రీ ఎంట్రీ!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లోకి రతికా రోజ్ రీ ఎంట్రీ!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఆట అంతా ఉల్టా పుల్టాగానే సాగుతోంది. కొత్త కొత్త టాస్కులు, ట్విస్టులతో ఆటను రక్తి కట్టిస్తున్నారు. సీజన్ లో కూడా కొత్త కొత్త నిర్ణయాలతో హౌస్ మేట్స్ కి బిగ్ బాస్ చుక్కలు చూపిస్తున్నారు. అంతేకాకుండా ఎప్పుడు ఎవరు హౌస్ లోకి వస్తారు అనే విషయం కూడా తెలియక తికమక పడుతున్నారు. అందరికీ షాకిస్తూ ఇటీవల హౌస్ లోకి ధామిని, రతికా రోజ్, శుభశ్రీలను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే వారిలో ఒకరు హౌస్ లోకి వస్తారు అని చెప్పారు. అందుకు ఓటింగ్ కూడా పెట్టారు. ఇప్పుడు వారిలో ఒకరు హౌస్ లోకి రాబోతున్నారు. అది మరెవరో కాదు.. రతికా రోజ్ అని టాక్ వినిపిస్తోంది.

బిగ్ బాస్ హౌస్ లో ముగ్గురిలో ఒకరిని హౌస్ లోకి తీసుకొస్తాం. అందుకు హౌస్ మేట్స్ ఓట్లు వేయాల్సి ఉంటుంది అని చెప్పారు. అందుకు హౌస్ లో ఉన్న వాళ్లంతా ఓట్లు వేశారు. అయితే ఓటింగ్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. సాధారణంగా ఓట్లు ఎవరికి ఎక్కువ పడితే వారిని హౌస్ లోకి తీసుకొస్తారు. కానీ, ఇక్కడ మాత్రం నాగార్జున ట్విస్ట్ ఇస్తూ.. ఎవరికైతే తక్కువ ఓట్లు పడతాయో వారిని హౌస్ లోకి తీసుకొస్తాం అని చెప్పారు. ఇప్పుడు హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్ మరెవరో కాదు రతికా రోజ్ అని చెబుతున్నారు. ఎందుకంటే హౌస్ లో రతికా రోజ్ కి కచ్చితంగా తక్కువ ఓట్లు పడి ఉంటాయి. హౌస్ లో శుభశ్రీకి ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు. రతికాకంటే కాస్త ఎక్కువ రోజులు ఉండటం వల్ల సుబ్బు అందరికీ క్లోజ్ అయ్యింది.

అంతేకాకుండా రతికాతో పోలిస్తే శుభశ్రీ కాస్త తక్కువ గొడవలు పెట్టుకుంది అని చెప్పాలి. అంతేకాకుండా సింగర్ ధామినీ కూడా హౌస్ లో చాలామందికి క్లోజ్ అయ్యింది. ముఖ్యంగా కిచెన్ టీమ్ కి సింగర్ ధామిని అవసరం బాగా ఉంది. కాబట్టి కిచెన్ లో ఉండేవాళ్లు అయితే సబ్బుకి లేదా ధామినీకి ఓటు వేస్తారు. అంతేకాకుండా రతికా రోజ్ నెగిటివిటీతో బయటకు వెళ్లింది. ఆ విషయం అందిరికీ తెలిసిందే. అందుకే ఆమెకు ఓటు వేసే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ విధంగా చూసుకుంటే తక్కువ ఓటింగ్ తో రతికా రోజ్ హౌస్ లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా రతికాపై నెగిటివిటీ తగ్గిపోయింది. ఆమె తిరిగి హౌస్ లోకి వస్తే బాగుంటుంది అంటూ ప్రేక్షకులు కూడా కామెంట్స్ చేస్తున్నారు.

అందుకే రతికాని హౌస్ లోకి తీసుకొచ్చేందుకు ఎక్కువ ఓట్లు కాకుండా.. తక్కవ ఓట్లు పడిన వారు రీ ఎంట్రీ ఇస్తారు అని చెప్పినట్లు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రతికాకు అసలు విషయం అర్థమైంది. తన ఆట ఎందుకు నెగిటివ్ అయ్యిందో తెలుసుకుంది. అంతేకాకుండా శివాజీ, ప్రశాంత్ లను మిస్ అవుతున్నాను అని చెప్పింది. ఇలాంటి సమయంలో ఆమె తిరిగి హౌస్ లోకి వెళ్తే ఆట కచ్చితంగా ఆసక్తిగా మారుతుంది. మరోవైపు రతికాకు రాఘవేంద్రరావు సినిమాలో అవకాశం కూడా దక్కింది. ఇలాంటి తరుణంలో హౌస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకాధరణ పొందితే రతికా రోజ్ కు కెరీర్ పరంగా కూడా బాగుంటుంది. మరి.. రతికా రోజ్ రీ ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments