ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి, అల్లూరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా

ఆంధ్ర రాష్ట్రం ఒక పుణ్యభూమి, ఇలాంటి పుణ్యభూమికి రావడం సంతోషం. తెలుగు జాతి యుగ పురుషుడు అల్లూరి అని, యావత్‌ దేశానికి అల్లూరి స్ఫూర్తి ప్ర‌ధాని మోదీ కొనియాడారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పెదఅమిరంలో 30 అడుగుల‌ అల్లూరి కాంస్య‌ విగ్ర‌హాన్ని వ‌ర్కువ‌ల్ గా ఆవిష్క‌రించారు. ఆ త‌ర్వాత‌
భీమవరంలోని అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో తెలుగులో ప్రసంగం ప్రారంభించారు ప్రధాని మోదీ.

ప్రసంగంలో శ్రీశ్రీ రాసిన తెలుగు వీర లేవ‌రా…దీక్ష‌బూని సాగ‌రా అన్న విప్ల‌వ‌గీతాన్ని ప్ర‌ధాని ప్ర‌స్తావించారు.

వీరభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. రంప ఆందోళనకు నేటికి వందేళ్లు పూర్తయ్యింది. ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగం చేశారు, అల్లూరి సీతారామరాజు గిరిజ‌నుల‌ శౌర్యానికి ప్రతీక. అల్లూరి జీవితం అంద‌రికీ స్ఫూర్తిదాయకం. స్వ‌రాజ్య నినాదంతో ప్రజలను ఏకతాటిపైకి తెచ్చారు. అల్లూరి కుర్ర‌వ‌య‌స్సులో బ్రిటిష‌ర్ల‌పై తిరగబడ్డారన్నారు. ఉయ్యాల వాడ నరసింహారెడ్డి, వీరుడు, గొప్ప ఉద్యమకారుడన్నారు.

స్వతంత్ర పోరాటంలో ఆదివాసీల త్యాగాలను ఘ‌నంగా ప్ర‌స్తావించిన మోదీ, ఆదివాసీ సంగ్రహాలయాలు, లంబసింగిలో అల్లూరి మెమోరియల్‌ మ్యూజియం ఏర్పాటు చేస్తామని ప్ర‌క‌టించారు. దేశం కోసం బలిదానం చేసిన వారి కలను, సాకారం చేయాలని కోరారు. అల్లూరికి పుట్టిన ఊరు, పోరాడిన ప్రాంతాల‌ను అభివృద్ధి చేస్తామని ప్రధాని అన్నారు. మొగల్లులోని ధ్యాన మందిరం, చింతపల్లి పీఎస్‌ను అభివృద్ధి చేస్తామ‌ని హామీ ఇచ్చారు. వన సంపదపై ఆదివాసులకే హక్కు కల్పిస్తున్నామన్నారు ప్ర‌ధాని.

ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌ పర్యటన ముగిసింది. భీమ‌వ‌రం సభ అనంతరం ప్రధాని మోదీ ప్రత్యేక హెలికాప్టర్‌లో గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. అక్కడ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్తున్నారు.


Show comments