iDreamPost
iDreamPost
ఇటీవల ఇంగ్లండ్‌లోని కార్న్‌వాల్‌లోని కవరాక్ అనే చిన్న గ్రామం సమీపంలో పక్కనే ఉన్న సముద్రంలో ఓ పెద్ద ఓడ గాల్లో ఎగరడం గమనించారు. దీంతో ఈ దృశ్యం చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన తర్వాత ఫోటోగ్రాఫర్ మార్టిన్ స్ట్రౌడ్ ఈ ఫ్లయింగ్ బోట్ ని ఫోటో తీశారు. ఇందులో పెద్ద కార్గో షిప్ పైకి ఎగురుతున్నట్లు కనిపిస్తోంది.
అయితే ఇది చూసిన వారంతా ఆ షిప్ నిజంగానే ఎగురుతుంది అని అనుకున్నారు. కానీ ఇది నిజం కాదని తెలుసుకున్న తర్వాత ఆశ్చర్యపోతున్నారు జనాలు. ఆప్టికల్ భ్రమల కారణంగా సముద్రం మీద ఉన్న ఈ ఓడ చూసేవారికి గాల్లో ఎగురుతున్నట్టు కనిపిస్తుంది. సముద్రం మరియు ఆకాశం దూరం నుంచి చూస్తే కలుస్తున్నట్టు కనిపిస్తాయని మన అందరికి తెలిసిందే. అలాగే వాటి రంగు కూడా ఒకేలా ఉంటుంది. దీంతో సముద్రంలో ఎక్కడో ఉన్న ఓ షిప్ ఆకాశానికి సముద్రానికి మధ్య గాలిలో ఉన్నట్టు చూసేవారికి కనిపిస్తుంది.
సముద్రం, ఆకాశం ఒకే విధమైన రంగు ఉండటం కారణంగా పెద్ద నౌక మేఘాల మధ్య ఉన్నట్టు, తెలియాడుతున్నట్టు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అంత తొందరగా గ్రహించటం చాలా కష్టం. అది నిజమేనా కాదా అని మళ్ళీ మళ్ళీ చూస్తాము. వీటిని ఆప్టికల్ భ్రమలు అంటారు. వీటి వల్ల నిజమైన దాన్ని గురించడం కొంచెం కష్టమవుతుంది. అక్కడి ప్రజలు పలువురు దీన్ని సోషల్ మీడియాలలో పోస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో దీన్ని చూసిన వారంతా ఆ షిప్ నిజంగానే ఎగురుతుంది అని అనుకుంటున్నారు.
ఇంగ్లాండ్ కార్న్‌వాల్‌లో ఇలాంటివి కనిపించడం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం కూడా ఒక పెద్ద పడవ ఇలాగే ఆకాశంలో తేలుతున్నట్లు కనిపించింది. ఆ తర్వాత అది ఆప్టికల్ భ్రమ అని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. ఇలాంటి సంఘటనలు అక్కడ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి.
Mind-bending optical illusion shows ghostly ship floating in the air https://t.co/VBVGS3pKTH pic.twitter.com/qE8m8F8I3K
— New York Post (@nypost) May 24, 2022