iDreamPost
iDreamPost
పరిశ్రమ కోరుతున్నట్టు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నట్టు సినిమా టికెట్ల ఆన్ లైన్ అమ్మకాల దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతానికి ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ వైపే పరిమితం అయినప్పటికీ త్వరలో తెలంగాణలోనూ అమలు జరిపే ఛాన్స్ ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఏపిలో ఈ మోడల్ సక్సెస్ అయితే అప్పుడు ఇతర రాష్ట్రాలు కూడా దాన్ని అందిచ్చిపుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. నిన్న ఆంధ్రప్రదేశ్ సర్కారు నుంచి థియేటర్ల యజమానులకు పలు వివరాలను కోరుతూ సర్కులర్లు వెళ్లాయి. కాకినాడ జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి డీటెయిల్స్ ని కోరుతూ పంపిన ఒక ఫార్మట్ సోషల్ మీడియా ద్వారా బయటికి వచ్చేసింది.
థియేటర్ పేరు, అడ్రెస్, లొకేషన్, యజమాని పేరు చిరునామా, లీజులు ఇచ్చి ఉంటే దాని వ్యవధితో పాటు తీసుకున్న వ్యక్తి వివరాలు, ఈమెయిల్, ఫోన్ నెంబర్, సీటింగ్ కెపాసిటీ, స్క్రీన్ల వారిగా, టికెట్ రేట్లు, బి ఫార్మ్ లైసెన్స్, ఎన్ఓసి సర్టిఫికెట్, ఆన్ లైన్ లో టికెట్లు అమ్ముతుంటే ఆ యాప్ తాలూకు డీటెయిల్స్, గత నాలుగేళ్లలో చిన్న పెద్ద మల్టీ స్టారర్ సినిమాలకు వచ్చిన ఆక్యుపెన్సీ ఎంత ఉంది, హాలుకు సంబంధించి ఎలాంటి ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఉంది, యంత్రాలు, ఇంటర్ నెట్ కనెక్షన్ వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్లు అన్నీ కోరుతూ దాంతో పాటు ఖాళీలను పెట్టి పూరించమని సింగల్ స్క్రీన్లు మల్టీ ప్లెక్సులకు పంపించారు.
చూస్తుంటే ఈ వ్యవహారానికి కొంత టైం పట్టేలా ఉంది. జనవరిలో ఆర్ఆర్ఆర్ తో మొదలుకుని భారీ పాన్ ఇండియా సినిమాలు రాబోతున్నాయి. వాటికి ఇప్పుడున్న టికెట్ రేట్లతో బిజినెస్ వర్కౌట్ చేసుకోవడం కష్టం. కనీసం రెండు వారాలు పెంచుకునే వెసులుబాటు ఇవ్వాల్సిందే. మరి ఆలోగా ప్రభుత్వం ఆన్ లైన్ టికెట్ వ్యవస్థను ఓ కొలిక్కి తీసుకురాగలరా అనేది వేచి చూడాలి. ఒక్కో టికెట్ మీద 25 నుంచి 40 రూపాయల దాకా ఛార్జ్ చేస్తున్న యాప్ ల దోపిడీ అరికట్టేందుకు ఇది మంచి మార్గమని ఆడియన్స్ భావిస్తున్న తరుణంలో ఈ ప్రయత్నం సక్సెస్ కావడం చాలా అవసరం. ప్రస్తుతం ఇండస్ట్రీలో దీని మీదే చర్చ జరుగుతోంది
Also Read : Rajinikanth : తగ్గిపోయిన మార్కెట్ ని తలైవా నిలబెట్టుకోవాలి