iDreamPost
iDreamPost
ఇప్పుడు శుక్రవారం వస్తోందంటే థియేటర్ ఫ్యాన్స్ కే కాదు ఓటిటి ఫాలోయర్స్ కు కూడా సరికొత్త ఎంటర్ టైన్మెంట్ దొరుకుతోంది. సినిమా హాళ్లు తెరిచినా డైరెక్ట్ డిజిటల్ కంటెంట్ ఆగడం లేదు. వెండితెర కోసం కాకుండా ప్రత్యేకంగా స్మార్ట్ స్క్రీన్ కోసమే తీస్తున్న ఇండిపెండెంట్ మూవీస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఈ వారం తెలుగులోనే మూడు ఆసక్తికరమైన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అందులో మొదటిది రేపు ప్రైమ్ లో రిలీజ్ కానున్న ‘మహాన్’. విక్రమ్-ధృవ్ కాంబోలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మాఫియా డ్రామా మీద ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగాయి. ఇవాళ రాత్రే స్ట్రీమింగ్ జరగొచ్చు.
ఎల్లుండి 11న ప్రియమణి ప్రధాన పాత్ర పోషించిన ‘భామ కలాపం’ ఆహాలో వస్తోంది. ప్రమోషన్ కూడా బాగానే చేశారు. కిచెన్ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా హోమ్ ఆడియన్స్ ని ఆకట్టుకోవచ్చు. సుమంత్ నటించిన ‘మళ్ళీ మొదలయ్యింది’ అదే రోజు జీ5 ద్వారా అందుబాటులోకి రానుంది. పెళ్ళై విడాకులు తీసుకున్న మధ్య వయసు యువకుడి జీవితంలో మరో ప్రేమకథ మొదలు కావడం ఇందులో మెయిన్ పాయింట్. ఇలాంటి సబ్జెక్టులు ఓటిటికే పర్ఫెక్ట్. అందుకే రెస్పాన్స్ బాగా ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. హిందీలో దీపికా పదుకునేని ముందు పెట్టి ప్రమోట్ చేసుకున్న ‘గెహరియా’ ప్రైమ్ ద్వారా 12కి ఫిక్స్ అయ్యింది.
కరోనా భయంతో థియేటర్ కు ఏం వెళతాంలే అనుకునేవాళ్లకు ఇలా చక్కని ఆప్షన్స్ ఉంచాయి ఓటిటిలు. ఖిలాడీ, ఎఫ్ఐఆర్, డిజె టిల్లు, సెహరిలు సినిమా హాళ్లకు వస్తుండగా పైన చెప్పినవి నేరుగా ఇంట్లోనే చూసుకోవచ్చు. ఇవి కాకుండా తమిళ ఇంగ్లీష్ తదితర భాషల్లో కొన్ని వెబ్ సిరీస్ లు కూడా రేపు ఎల్లుండి రాబోతున్నాయి. మొత్తానికి వినోదానికి లోటు లేకుండా ఇంటా బయటా రెండు చోట్ల శుక్రవారాలు సందడి జరగబోతోంది. తక్కువ బడ్జెట్ లో రూపొందిన సినిమాలు అధిక శాతం రాబోయే రోజుల్లో ఓటిటి బాట పట్టడం ఒక మాములు విషయంగా మారిపోవచ్చు. థియేట్రికల్ రిలీజ్ జరుపుకున్నవి కూడా తక్కువ గ్యాప్ లోనే వచ్చేస్తాయి
Also Read : Writing With Fire : మరో ఇండియన్ కంటెంట్ కు దక్కిన గౌరవం