Mumbai Crime News: 20 రోజుల్లో ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి.. పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు!

20 రోజుల్లో ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి.. పోలీసుల దర్యాప్తులో సంచలన నిజాలు!

మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. కేవలం 20 రోజుల్లోనే ఓ కుటుంబంలోని ఏకంగా ఐదుగురు వ్యక్తులు చనిపోయారు. ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో మృతుల బంధువులు షాక్ గురయ్యారు. వారికి ఏం చేయాలో తెలియక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే పోలీసుల దర్యాప్తులో మాత్రం వీరి మృతికి సంబంధించి సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆలస్యంగా బయటపడ్డ ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. సినిమా లెవల్ లో ఉన్న ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ముంబై గడ్చిరోలిలో శంకర్ కుంభారే, విజయ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కోమల్, ఆనంద కూతుళ్లు, కుమారుడు రోషన్ ఉన్నారు. కాగా రోషన్ కు గతంలో సంఘమిత్ర అనే యువతితో వివాహం జరిగినట్లు తెలుస్తుంది. కొంత కాలానికి ఈ మహిళకు అతని అత్తమామ, భర్త తీరు నచ్చేలేదు. అప్పటి నుంచి వారిపై కోపంతో రగిలిపోయింది. ఇదిలా ఉంటే.. ఇదే కుటుంబంతో రోసా అనే మహిళకు ఆస్తి తగాదాలు ఉన్నాయి. దీంతో వీరిద్దరు ఓ రోజు కలుసుకుని ఒకరి విషయాలు ఒకరు పంచుకున్నారు.

ఒకే కుటుంబంపై ఇద్దరికీ కోపం ఉండడంతో ఇద్దరు చేతులు కలిపారు. ఎలాగైన ఆ కుటుంబాన్ని అంతం చేయాలని ప్లాన్ గీశారు. ఇక పక్కా పథకం ప్రకారమే.. సంఘమిత్ర, రోసా కలిసి వీరి హత్యకు పావులు కదిపారు. ముందుగా సెప్టెంబర్ 20న దంపతులైన శంకర్ కుంభారే, విజయలు తీనే ఆహారంలో విషం కలిపారు. ఇది తిని ఇద్దరు అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై ఆస్పత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ వారం రోజుల వ్యవధిలో ఈ భార్యాభర్తలు చనిపోయారు. మరుసటి రోజు వీరి ఇద్దరు కూతుళ్లు, కుమారుడు రోషన్ సైతం అస్వస్థతకు గురయ్యారు.

ఇతర కుటుంబ సభ్యులు అప్రమత్తమై వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వీరు ముగ్గురు కూడా చనిపోయారు. అయితే వరుసగా ఒకే కుటుంబంలో ఐదుగురు మరణించండంతో స్థానికులకు అనుమానం కలిగింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ విచారణలో పోలీసులకు సంచలన నిజాలు తెలిశాయి. మృతుల తిన్న ఆహారంలో రోసా, సంఘమిత్ర అనే ఇద్దరు మహిళలు విషం కలిపారని, అది తిని వారు మృతి చెందారని తేలింది. ఆ కుటుంబంపై ఉన్న పగతోనే ఇలా చేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. దీంతో పోలీసులు తాజాగా వారిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది.

Show comments