జబర్దస్త్ కామెడీ షో గురించి..తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో ద్వారా ఎంతోమంది మంచి గుర్తింపు సంపాదించారు. ఇంకా సుడిగాలి సుధీర్, షకలక్క శంకర్ లాంటి వాళ్లు అయితే ఏకంగా సినిమాలో హీరోగాలు చేశారు. ఇంకా మరెందరో జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేమ్ తో వెండితెరపైకు మెరిశారు. అలా జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ముక్కు అవినాష్ ఒకరు. తనదైన కామెడీ స్టైల్ తో ప్రేక్షకులను కడుబ్బా నవ్విస్తాడు. ఇటీవలే సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి.. తనకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తున్నాడు. ఎప్పుడు నవ్విస్తూ, సందడిగా ఉండే వీడియోలు పెట్టే.. అవినాష్.. తాజాగా ఓ ఎమోషనల్ వీడియో రిలీజ్ చేశాడు. అవినాష్ వాళ్ల అమ్మ హెల్త్ గురించి ఆ వీడియోలో ఉంది.
బుల్లితెరపై మంచి కమెడియన్ గా పేరు సంపాదించుకున్న ముక్కు అవినాష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ లో తన కామెడీతో ప్రేక్షకులను ఫుల్ ఎంటర్ టైన్ చేశాడు. బులితెరపైకి వచ్చిన అతి తక్కువ సమయంలో తనకంటూ ప్రత్యేకం గుర్తింపు సంపాదించుకున్నాడు. జబర్దస్త్ కు ముందు మిమిక్రీ ఆర్టిస్ట్ గా పనిచేసిన అవినాష్. అక్కడి నుండి జబర్దస్త్ లో అడుగు పెట్టి.. మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. బుల్లితెరపై వచ్చిన ఫేమ్ తో అవినాష్ వెండితెరపై కూడా అవకాశాలు అందుకున్నాడు. అలానే బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అవినాష్ వెళ్లి.. మంచి సందడి చేశాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తరువాత మళ్లీ పలు షో ల్లో పాల్గొని బాగా సందడి చేశాడు.
యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకుని అందులో నిత్యం ఏదో ఒక వీడియో పంచుకుంటూనే ఉంటారు. తన భార్య, అమ్మతో వీడియోలు చేసి సందడి చేస్తాడు. చాలా వీడియోల్లో తన అమ్మ చేత అవినాష్ డ్యాన్స్ సైతం చేయించాడు. అలా తన తల్లికి సంబంధించిన ఏదో ఒక వీడియో తన ఛానల్ లో పోస్ట్ చేస్తుంటారు. ఎప్పుడు సందడి సందడిగా ఉండే వీడియోలు పోస్ట్ చేసే అవినాష్.. తల్లి ఆరోగ్యం గురించి వీడియో చేశాడు. ఇటీవలే ఆమెకు హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లు అవినాష్ తెలిపాడు. అయితే సమయానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిచామని, మరికొన్ని రోజుల తరువాత అమ్మ మాములు స్థితికి వచ్చి.. వీడియోల్లో సందడి చేస్తుందని తెలిపారు. తన కొడుకులే తనను బతికించారని, వాళ్లు లేకుంటే నేను ఉండేదాన్ని కాదంటూ అవినాష్ వాళ్ల అమ్మ ఎమోషన్ల అయ్యారు.
ఇక తన తల్లి ఆరోగ్యం గురించి అవినాష్ మాట్లాడుతూ..” ప్రతి ఒకరు ఒక స్టేజ్ వచ్చాక.. సమస్యలను ఫేజ్ చేస్తుంటారు. అలానే మా అమ్మ కూడా ఆరోగ్య సమస్యలను ఫేజ్ చేశారు. కొంతకాలం నుంచే ఆమె డయబేటిస్ సమస్యలతో బాధపడుతున్నారు. ఈక్రమంలో మూడు రోజుల క్రితం గుండె పోటు వచ్చింది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా.. హార్ట్ వీక్ గా ఉందని వైద్యులు తెలిపారు. అయితే మెరుగైన వైద్యం కోసం హైదరబాద్ కు తీసుకొచ్చి.. స్టంట్స్ వేయించాము. ప్రస్తుతం అమ్మ ఆరోగ్యం బాగానే ఉందని మరికొద్ది రోజుల్లోనే ఇంటికి వెళ్తారు” అని అవినాష్ తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఇక అవినాష్ వాళ్ల మదర్ పూర్తిగా కోలుకుని ఆయురారోగ్యలతో ఉండాలని మీరూ కామెంట్స్ రూపంలో తెలియజేయండి.