ప్రధాని నరేంద్ర మోడీ అనూహ్యంగా వచ్చే ఆదివారం సోషల్ మీడియాని వీడే యోచనలో ఉన్నట్టు ఈ ఆదివారం నుండి తన అధికారిక ట్విట్టర్, పేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, యూ ట్యూబ్ ఇలా అన్ని సోషల్ మీడియా అకౌంట్ల నుండి వైదొలగాలని ఆలోచిస్తున్నా.. దీనిపై ఏ విషయం మీకు తెలియపరుస్తానని ప్రధాని తన ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చెయ్యడం సోషల్ మీడియాలో సంచలనంగా మారిన నేపథ్యంలో నిన్నటి నుడి సోషల్ మీడియాలో ఇది పెద్ద ఎత్తున ట్రేండింగ్ గా మారింది.
వాస్తవానికి మనదేశంలో సోషల్ మీడియాను వాడుకొని బాగా పాపులరైన రాజకీయ నాయకులలో మోడి తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. 2009 లోనే సోషల్ మీడియాలో అడుగుపెట్టిన మోడీ సామాజిక మాధ్యమాలలో అనతికాలంలోనే పెద్ద సెలబ్రిటీగా మారారు. ఈ విషయంలో దేశంలో ఆయనే నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో అత్యధికంగా ఫాలోయర్లు వున్నా మొదటి ఐదుగురు లో మోడీ ఒకరు.
ఈనేపథ్యంలో అకస్మాత్తుగా సోషల్ మీడియా నుంచి తప్పుకోవటం గురించి ఆలోచిస్తున్నానని మోడీ ట్వీట్ చేయడంతో మొదట ఎవరికీ అర్ధం కాలేదు. జాతీయ మీడియాలో కూడా ఈ అంశంపై పెద్దఎత్తున చర్చ జరిగింది. మోడీ ఆకస్మిక నిర్ణయంతో సోషల్ మీడియాలో పెద్దఎత్తున ఊహాగానాలు ప్రచారమయ్యాయి. సోషల్ మీడియాను వీడొద్దంటూ మోడీ అభిమానులు, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున అభ్యర్దించారు. ఈ అంశంపై స్పందించిన విపక్ష నేత రాహుల్ గాంధీ మీరు విడాల్సింది ద్వేశాన్ని కానీ సోషల్ మీడియాని కాదంటూ ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన అనేకమంది రాజకీయ నాయకులు ప్రధాని నిర్ణయాన్ని పునర్ సమీక్షించుకోవాలని కోరారు. శిశిథరూర్, సుధీంద్ర కులకర్ణి లాంటి వారైతే మోడీ దేశంలో సోషల్ మీడియాని బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నాడని ఆరోపించారు.
అయితే ఈ ఊహాగానాలన్నింటికీ చెక్ పెడుతూ ప్రధాని మోడీ ఈ అంశంపై పూర్తి స్పష్టత ఇస్తూ ఈరోజు మరో ట్వీట్ చేశాడు. వచ్చే ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ ఒక్క రోజు తన వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్లన్నింటిని జీవితంలో గొప్ప స్ఫూర్తిదాయకమైన విజయం సాధించిన మహిళ చేతిలో పెడతానని ట్వీట్ చేశాడు. అయితే ఆ స్ఫూర్తిదాయకమైన మహిళా ఎవరో #SheInspiresUs అనే పేరుతొ ఉన్న యాష్ ట్యాగ్ తొ ఉన్న లింక్ ద్వారా మీరే సూచించాలని, ఆ అవకాశం కూడా మహిళలలకే ఇస్తున్నానని ఆసక్తికర ట్వీట్ చేశాడు. తానూ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఈ మహిళాదినోత్సవం నాడు కొన్ని లక్షలమంది స్ఫూర్తిదాయకమైన మహిళల జీవితాలలో వెలుగులు నిండాలని ప్రధాని ఆకాంక్షించారు.
మోడీ తీసుకున్న ఈ తాజా నిర్ణయానికి నెటిజన్లనుండి ముఖ్యంగా మహిళా లోకం నుండి స్పందన ఏవిధంగా ఉంటుందో చూడాలి. అయితే నిన్న మోడీ ఉద్దేశపూర్వకంగానే ఆదివారం సోషల్ మీడియా నుండి తప్పుకుంటున్నట్టు ట్వీట్ చేశారని అర్ధం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే మోడీ సోషల్ మీడియా నుండి శాశ్వతంగా తప్పుకుంటున్నాను అని అర్ధంవచ్చేలా నిన్న చేసిన ట్వీట్ కేవలం ప్రచారం కోసమేనని చెప్పకతప్పదు.