iDreamPost
android-app
ios-app

తల్లి ప్రియుడినే కూతురు ప్రేమిస్తే – Nostalgia

  • Published Nov 27, 2020 | 11:58 AM Updated Updated Nov 27, 2020 | 11:58 AM
తల్లి ప్రియుడినే కూతురు ప్రేమిస్తే – Nostalgia

ఎంత సినిమా అయినా దర్శక నిర్మాతలు ప్రతి కథలోనూ పూర్తి సృజనాత్మక స్వేచ్ఛ తీసుకోలేరు. ఇక్కడి ప్రేక్షకుల అభిరుచి, సంప్రదాయాలు, కట్టుబాట్లు దృష్టిలో ఉంచుకుని తెరకెక్కించాల్సి ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా ఫలితం ఊహకందనంత దారుణంగా ఉంటుంది. అలాంటిదే ఈ ఉదాహరణ. 1989లో శ్రీదేవి ప్రధాన పాత్రలో సుప్రసిద్ధ దర్శకనిర్మాత యాష్ చోప్రా రూపొందించిన ‘చాందిని’ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీనికన్నా చాలా ఏళ్ళ ముందే తన డ్రీం ప్రాజెక్ట్ గా భావిస్తున్న ఓ వివాదాస్పద కథాంశంతో సినిమా తీసేందుకు ఇదే మంచి సమయమని భావించి దానికి రూపకల్పన చేశారు. అదే 1991లో వచ్చిన ‘లంహే’. తన రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా మీసాలు లేకుండా అనిల్ కపూర్ నటించిన మొదటి సినిమా ఇదే.

అనిల్ కపూర్ హీరోగా శ్రీదేవి డ్యూయల్ రోల్ లో ఈ ప్రాజెక్టుని ప్రకటించినప్పుడు యష్ చోప్రా సన్నిహితులు కథ వినగానే వద్దని వారించారు. ఎందుకో మీరే చూడండి. లండన్ లో స్థిరపడిన రాజస్థాన్ కు చెందిన వీర్(అనిల్ కపూర్)ఓసారి స్వంత ఊరికి వస్తాడు. అక్కడ పల్లవి(శ్రీదేవి)ని చూసి మనసు పారేసుకుంటాడు. ఆరాధిస్తాడు. అయితే అప్పటికే పల్లవి సిద్దార్థ్(దీపక్)ని ప్రేమించి ఉంటుంది. దీంతో హతాశుడైన వీర్ ఇద్దరికీ దగ్గరుండి పెళ్లి జరిపిస్తాడు. ఓ పాపకు జన్మనిచ్చాక పల్లవి దంపతులు యాక్సిడెంట్ లో చనిపోతారు. ఆ బిడ్డ బాధ్యతలు బామ్మ(వహీదా రెహమాన్)కు అప్పజెప్పి వీర్ లండన్ కు వెళ్ళిపోతాడు. పెద్దయ్యాక ఆ అమ్మాయి పూజా(శ్రీదేవి)గా ఎదిగి వయసు వ్యత్యాసం ఉన్నా వీర్ నే ప్రేమిస్తుంది. ముందు వీర్ తటపటాయించినా తర్వాత ఒప్పుకోవడంతో చివరికి ఇద్దరూ ఒకటవుతారు.

నిజానికి ఈ పాయింట్ ఏ మాత్రం హర్షించదగినది కాదని ఎందరు చెప్పినా యష్ వినలేదు. ధైర్యంగా ముందడుగు వేశారు. తండ్రితో సమానమైన వాడిని కూతురు ప్రేమించడం ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో లంహేకు బాక్సాఫీస్ వద్ద పరాజయం తప్పలేదు. ఓవర్ సీస్ ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. శివ్ హరి మధురమైన పాటలు, శ్రీదేవి మర్చిపోలేని నటన, సినిమాటోగ్రఫీ లంహేకు తర్వాతి కాలంలో క్రమంగా కల్ట్ స్టేటస్ తీసుకొచ్చాయి. అయితే ఈ ఫలితం యష్ చోప్రాను అయిదారు నెలల పాటు తీవ్ర నిరాశకు గురి చేసింది. సగటు భారతీయులకు ఆమోదయోగ్యం కానీ పాయింట్ ని ఆయన ఎంత అద్భుతంగా తెరకెక్కించినా ఉపయోగం లేకపోయింది. అయితే లంహేకు ఉత్తమ దర్శకుడు, నటితో సహా మొత్తం ఐదు జాతీయ అవార్డులు దక్కాయి. చాందినిని తెలుగులో డబ్బింగ్ చేసి లాభపడిన టి.సుబ్బరామిరెడ్డి దీన్ని మాత్రం అనువదించే సాహసం చేయలేకపోయారు

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişRoyalbetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetcasibomMadridbetHoliganbet GirişGrandpashabet Giriş