తెలంగాణలో దేవుళ్లకు ఐటీ షాక్.. ఆదాయపు పన్ను కట్టాలంటూ నోటీసులు!

సాధారణంగా ఆదాయపు పన్నును కట్టని వారికి ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తుంటుంది. వారి నుంచి టాక్స్ ను వసూలు చేస్తుంది. ఇలా ఎంతో మంది వ్యాపారులు, ఇతర రంగాలకు చెందిన వారి నుంచి ఐటీ శాఖ ప్రభుత్వానికి రావాల్సిన టాక్స్ ను రాబడుతుంది. అయితే తాజాగా తెలంగాణలోని దేవుళ్లకు ఐటీ శాఖ అధికారులు షాకిచ్చారు. మరి.. దేవుళ్లకు ఐటీ శాఖ వాళ్లు షాకివ్వడం ఏమిటనే సందేహం మీకు రావచ్చు. అవునండీ..మీరు విన్నది, చదివినది నిజమే.. ఐటీ శాఖ వాళ్ల తెలంగాణలోని దేవుళ్లకు ఆదాయపు పన్ను కట్టాలంటూ నోటీసులు జారీ చేశారు. మరీ.. ఐటీశాఖ నోటీసులు ఏంటి, ఆవివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

తెలంగాణలోని పలు ప్రముఖ దేవాలయాలకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న దేవాలయాలు ఆదాయపు పన్ను కట్టాలంటూ అందులో పేర్కొన్నారు. ఈ జాబితాలో కొమురవెల్లి మల్లన్న స్వామి మొదటి స్థానంలో ఉన్నారు. రూ.8 కోట్ల ట్యాక్స్ కట్టాలని, సకాలంలో పన్ను కట్టనందువల్ల మరో రూ.3 కోట్ల జరిమానా కూడా చెల్లించాలని నోటీసుల్లో తెలిపారు. మొత్తంగా కొమురెల్లి మల్లన్న దేవస్థానం రూ.11 కోట్లు కట్టాలంటూ ఐటీ శాఖ తెలిపింది. కేవలం ఇలా కొమురెల్లి మల్లన్న దేవాలయానికి కాకుండా తెలంగాణలో దక్షిణ కాశీ పేరొందిన వేములవాడ రాజన్న టెంపుల్ కూడా నోటీసులు ఇచ్చారు.

అదేవిధంగా చదువుల నిలయమైన బాసర సరస్వతి ఆలయానికి సైతం ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపింది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో దేవుళ్ళకే ఐటీ నోటీసులు అన్న చర్చ ప్రారంభమైంది. ఆదాయపు పన్ను కట్టాలంటూ ఆలయాలకు ఐటీ నోటీసులు ఇవ్వటంతో సంచలనం గా మారింది. మరోవైపు దేవాలయాలకు ఐటీ నోటీసులు అందడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపార సంస్థలు, వ్యక్తుల విషయంలో వ్యవహరించినట్టు ఆలయాలపై కఠిన వైఖరిని అవలంభించడం మంచిది కాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరి.. దేవాలయాలకు ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments