బాలీవుడ్ భారమంతా ఇద్దరి మీదే

ముఖ్యంగా షంషేరా, సామ్రాట్ పృథ్విరాజ్ డిజాస్టర్లు మార్కెట్ ని మాములుగా దెబ్బ తీయలేదు. ట్రేడ్ తీవ్రంగా నష్టపోయింది. ఈ ఏడు నెలల కాలంలో కేవలం ది కాశ్మీర్ ఫైల్స్, భూల్ భూలయ్యా 2, గంగూబాయ్ కటియావాడిలు మాత్రమే సక్సెస్ సాధించడం తీవ్ర ప్రభావం చూపుతోంది.

ముఖ్యంగా షంషేరా, సామ్రాట్ పృథ్విరాజ్ డిజాస్టర్లు మార్కెట్ ని మాములుగా దెబ్బ తీయలేదు. ట్రేడ్ తీవ్రంగా నష్టపోయింది. ఈ ఏడు నెలల కాలంలో కేవలం ది కాశ్మీర్ ఫైల్స్, భూల్ భూలయ్యా 2, గంగూబాయ్ కటియావాడిలు మాత్రమే సక్సెస్ సాధించడం తీవ్ర ప్రభావం చూపుతోంది.

ఒకపక్క సౌత్ సినిమాల డామినేషన్ తో అల్లాడిపోతుండగా మరోపక్క భారీ బడ్జెట్ తో తీసిన స్ట్రెయిట్ సినిమాలు దారుణంగా బోల్తా కొడుతుండటంతో బాలీవుడ్ బిక్కుబిక్కుమంటోంది. ముఖ్యంగా షంషేరా, సామ్రాట్ పృథ్విరాజ్ డిజాస్టర్లు మార్కెట్ ని మాములుగా దెబ్బ తీయలేదు. ట్రేడ్ తీవ్రంగా నష్టపోయింది. ఈ ఏడు నెలల కాలంలో కేవలం ది కాశ్మీర్ ఫైల్స్, భూల్ భూలయ్యా 2, గంగూబాయ్ కటియావాడిలు మాత్రమే సక్సెస్ సాధించడం తీవ్ర ప్రభావం చూపుతోంది. వీటికన్నా చాలా మెరుగ్గా ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2, విక్రమ్ లు ఆడటంతో ఇప్పుడు తన ఆశలన్నీ 11న రాబోయే లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ ల మీదే పెట్టుకుని ఎదురు చూస్తోంది.

ఇలాంటి క్లాష్ ఈమధ్య జరగలేదు. అమీర్ ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేస్తున్నాడు. మరోవైపు బాయ్ కాట్ లాల్ సింగ్ నినాదం సోషల్ మీడియాలో ఊపందుకుంది. సినిమాకు గతంలో జరిగిన వివాదాలను ముడిపెట్టవద్దని అభిమానులు ఎంతగా కోరుతున్నా ఇవి ఆగడం లేదు. దానికి తోడు కరీనా కపూర్ హీరోయిన్ కావడంతో ఓ వర్గం మరింత రెచ్చిపోతోంది. నాగ చైతన్య క్యారెక్టర్ ని గత రెండు మూడు రోజులుగా బాగా పబ్లిసిటీ చేసి హైప్ ని తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ చేస్తుండటంతో ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఆశిస్తున్నారు. 2 గంటల 45 నిమిషాల నిడివితో ఈ ఫారెస్ట్ గంప్ రీమేక్ ఏ రేంజ్ కు వెళ్తుందో చూడాలి.

ఇక రక్షా బంధన్ విషయానికి వస్తే లెన్త్ ని కేవలం 1 గంట 50 నిమిషాలకు పరిమితం చేయడం ఆశ్చర్యపరుస్తోంది. ఇంత తక్కువ నిడివితో అక్షయ్ కుమార్ సినిమా గతకొద్ది కాలంలో ఏదీ రాలేదు. అందులోనూ ఇది సెంటిమెంటల్ ఎమోషనల్ డ్రామా. అయితే దీనికి నిషేధాల పిలుపులు తప్పలేదు. రక్షా బంధన్ కథకురాలు కనిక ధిల్లాన్ గతంలో చేసిన కొన్ని యాంటీ హిందూ ట్వీట్లను నెటిజెన్లు ఇప్పుడు బయటికి తీస్తున్నారు. వీటి తాలూకు ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుందో చెప్పలేం. మొత్తానికి ఈ రెండు సినిమాల్లో ఏది పెద్ద హిట్ అయినా బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటుంది. లేదూ అంటే కథ మళ్ళీ మొదటికి వచ్చి షారుఖ్ ఖాన్ పఠాన్ దాకా వెయిట్ చేయాలి

Show comments