Super Giants vs Royal Challengers వ‌ర్షంతో ఎలిమినేటర్‌ మ్యాచ్ ఆలస్యం, వాట్ నెక్ట్స్?

టీ20 లీగ్‌లో ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు వర్షం బెడద త‌ప్ప‌లేదు. జ‌ల్లుల కార‌ణంగా ఆట ఆలస్య‌మైంది. ప్లేఆఫ్స్‌ మ్యాచులకు వ‌ర్షాలు కురిస్తే పరిస్థితి ఏంటి? బీసీసీఐ ద‌గ్గ‌ర ప్లాన్ రెడీ.

అనుకున్న‌ట్లు గారాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కాలేదు. ఇంకా టాస్ కూడా ప‌డ‌లేదు. జ‌ల్లులు త‌గ్గితే మ్యాచ్‌ రాత్రి 9.40 గంటలకైనా ప్రారంభమైతే రెండుజ‌ట్లూ 20 ఓవ‌ర్లు చొప్పున ఆడ‌తాయి. అంటే ప్లేఆఫ్స్‌లో మ్యాచ్‌కు అదనంగా రెండుగంట‌ల స‌మ‌యం ఉంది.

ఆలస్యమయ్యి రాత్రి 9.40 గంటలకు మ్యాచ్ మొద‌లైతే ఓవర్లలో ఎలాంటి కోత ఉండ‌దు. ఫైనల్‌ మ్యాచ్‌ మామూలు షెడ్యూల్‌ ప్రకారం రాత్రి 8 గంటలకు కాబట్టి, వర్షం వల్ల ఆలస్యమైనా, 10.10 గంటలకు మొద‌లైతే, పూర్తి ఓవర్లతోనే మ్యాచ్ ను నిర్వ‌హిస్తారు.

మే 29న అహ్మదాబాద్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే అందుబాటులో ఉంది. మ్యాచ్‌ వాయిదా పడితే మే 30న మ్యాచ్‌. అప్పుడుకూడా రెండుగంట‌ల‌ అదనపు సమయాన్ని ఇచ్చారు.

ఇక‌వేళ‌ 9.40 గంటల్లోగా మ్యాచ్ మొద‌లుకాక‌పోతే ఓవర్లు త‌గ్గ‌డం ఖాయం. మ‌రీ లేట్ అయితే, కనీసం 5 ఓవర్ల మ్యాచ్ ను నిర్వ‌హిస్తారు. కాక‌పోతే ఒక‌టే కండీష‌న్. రాత్రి 11.56 గంటలకు ప్లే ఆఫ్‌ మ్యాచ్ మొద‌లుకావాలి. ఇంకా ఆల‌స్యం అయ్యింద‌ని అనుకొందాం. అప్పుడు సూపర్‌ ఓవర్‌ ద్వారా విన్న‌ర్ ను నిర్ణ‌యిస్తారు. అదికూడా రాత్రి 12.50 గంటల్లోపే ప్రారంభం కావాలి.

ఒక‌వేళ వ‌ర్షం కురుస్తోంది. సూపర్‌ ఓవర్‌ కూడా కుద‌ర‌దు. అప్పుడేం చేయాలి? లీగ్‌ మ్యాచ్‌ల పాయింట్ల ఆధారంగా విజేతను ప్రకటిస్తారు. ఈరోజు మ్యాచ్లో ల‌క్నోకి ఎక్కువ పాయింట్లు ఉన్నాయి కాబ‌ట్టి, విజేత ఆజ‌ట్టే.

ఫైనల్‌ మ్యాచ్‌కు ఎలాగూ రిజర్వ్‌ డే ఉంది. నో టెన్ష‌న్. మే 29న ఫైన‌ల్ కు సంబంధించిన టాస్ పడి, మ్యాచ్‌ ప్రారంభం కాకపోతే.. రిజర్వ్‌డేలో మళ్లీ టాస్‌ నుంచి ప్రారంభిస్తారు. ఒక‌వేళ మ్యాచ్‌ మొదలయ్యాక ఆగిపోతే అప్పుడు ఏం చేస్తారు? రిజర్వ్‌ డే రోజు ఆగిన చోట నుంచే మ్యాచ్‌ ప్రారంభిస్తారు.

వ‌రుణుడు ప‌గ‌బ‌ట్టి, ఎట్టిప‌రిస్థితుల్లోనూ మ్యాచ్ కి ఛాన్స్ లేక‌పోతే పాయింట్ల పట్టిక ఆధారంగానే విజేతను నిర్ణయిస్తారు. అప్పుడు గుజ‌రాత్ జ‌ట్టు టైటిల్ విన్న‌ర్.

Show comments