Swetha
ఐడ్రీమ్ మీడియా మాజీ యాంకర్లు చేసిన మిస్ లీడింగ్ థంబ్ నెయిల్స్ ఆరోపణలపై.. ఐడ్రీమ్ మీడియా అధికారిక స్పందన.
ఐడ్రీమ్ మీడియా మాజీ యాంకర్లు చేసిన మిస్ లీడింగ్ థంబ్ నెయిల్స్ ఆరోపణలపై.. ఐడ్రీమ్ మీడియా అధికారిక స్పందన.
Swetha
ఇలా సినీ లెజెండ్స్, మిలిటరీ అధికారులు, సాహితీ ప్రముఖులు, సమాజ నాయకులు మరియు ఉన్నత బ్యూరోక్రాట్లతో సహా వేలాది ప్రముఖ వ్యక్తులు తమ కథలను, అనుభవాలను చెప్పడానికి మాపై నమ్మకం ఉంచారు. మేము ఒక నిబద్ధత, నిజాయితీ, విలువలతో సరిగ్గా పని చేశాము కాబట్టే.. ఇంత మంది నమ్మకాన్ని పొంద కలిగాము.
యాంకర్ S___ థంబ్ నెయిల్స్ పై విభేదాల కారణంగా ఐడ్రీమ్ మీడియాను విడిచిపెట్టిందన్న ఆరోపణ పూర్తిగా అబద్ధం.
ఐడ్రీమ్ లో యాంకర్ S___ రాజీనామాకు నిజమైన కారణాలు:
ఐడ్రీమ్ లో నవంబర్ 2023 నుండి ఫిబ్రవరి 2025 వరకు (16 నెలలు) పని చేసిన సమయంలో యాంకర్ S.. నెలకు ₹4 లక్షల జీతం పొందేవారు. ఇది తెలుగు డిజిటల్ మీడియా రంగంలో అత్యధిక జీతం. కొన్ని కమర్షియల్ ఇంటర్వ్యూలు చేసినందుకు కూడా ఆమెకు అదనంగా రూ.2 లక్షలు పైనే చెల్లించాము.
S___ & P___ మాపై ఆరోపణలు చేశాక వారికి.. వ్యక్తిగతంగా వాట్సాప్ సందేశాలు పంపాము.
వారికి మెసేజులు పంపి ఇప్పటికి ఆరు వారాలు పైనే అవుతున్నా వారిద్దరి నుండి ఎటువంటి స్పందన రాలేదు.
మేము వారికి పంపిన కీలక సందేశాలు క్రింద ఉన్నాయి:
హాయ్ S___,
నీవు క్షేమంగా ఉన్నావని ఆశిస్తున్నాను.
గత వారం జరిగిన పరిణామాలు నన్ను బాగా బాధించాయి.
“గాయత్రి భార్గవి ఫిర్యాదులో ఓ నిజమైన బాధ ఉంది. ఆమె వేదనను నేను నిజంగా అర్థం చేసుకున్నాను. నేను వ్యక్తిగతంగా ఆమెకు క్షమాపణ చెప్పడానికి సంప్రదించాను. అదే విధంగా నేను బహిరంగ క్షమాపణ కూడా చెప్పాను. ఈ సందేశం ఆమె గురించి కాదు – ఆమె చేసింది పూర్తిగా సమంజసం, ఆమె బాధను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను.”
ఆ సమయంలో.. నీవు కూడా ఈ సమస్యలోకి అనవసరంగా లాగబడ్డావని నేను భావించాను. “ఈ గందరగోళంలోకి నిన్ను లాగినందుకు వెరీ సారీ S___” అని వెంటనే నీకు మెసేజ్ పంపించాను. అయితే.., సంస్థతో ఇంత దీర్ఘకాల సంబంధం ఉన్నా.. నీవు ఆ మెసేజ్ కి స్పందించకపోవడం నన్ను కొంచెం ఆశ్చర్యపరిచింది..
కొంత సమయం తర్వాత ఎవరో నాకు ఒక వీడియో ఫార్వార్డ్ చేశారు. అది నీ వీడియో. అందులో నీవు ఐడ్రీమ్ ను నిందించడమే కాక, చాలా కాలం నాటి సునీత ఎపిసోడ్ ను, అలాగే ప్రేమ వీడియో థంబ్ నెయిల్స్ గురించి ఆమె ఆందోళనలను (ఇవి నా దృష్టికి ఎప్పుడూ రాలేదు) ప్రస్తావించావు. ఆ వీడియోకి, అందులో నీవు ఉపయోగించిన టోన్ కు.. నేను నిజంగా షాక్ అయ్యాను.
గతంలో నీవు చేసినట్లుగా.. కేవలం కాల్ చేసి లేదా సందేశం పంపి ఉంటే.. నేను వెంటనే ఆ థంబ్ నెయిల్ వ్యవహారంలో చర్య తీసుకునేవాడిని. ఎవరైనా ఆందోళన వ్యక్తం చేసినప్పుడు అటువంటి వీడియోలు లైవ్ లో ఉండనివ్వనని నీకు తెలుసు కూడా. ఇది ఎల్లప్పుడూ మా పని విధానం. ఇది నీకే కాదు, ఐడ్రీమ్ తో పనిచేసిన ప్రతి ఒక్కరికీ కూడా తెలుసు.
తప్పులు జరిగి ఉండవచ్చు. కానీ, నేను ఉద్దేశపూర్వకంగా ఐడ్రీమ్ లో ఇటువంటి థంబ్ నెయిల్స్ ను ఎప్పుడూ ప్రోత్సహించను. అది ఎప్పటికీ జరగదు.
———
నువ్వు, P___.. ఒక వ్యక్తికి ఫోన్ చేసి.. IDreamకి వ్యతిరేకంగా ఒక వీడియో చేసి, పోస్ట్ చేయమని కోరారు. ఆ వ్యక్తి.. మీ ఆడియో రికార్డు నాకు వినిపించారు. అలాగే, P___.. ఇతర జర్నలిస్టులతో ఉన్న వాట్సాప్ గ్రూప్ చాట్ లో ఐడ్రీమ్ ను నిందిస్తూ మెసేజ్ లు పంపినట్లు నేను చూశాను. నీవు, P___.. నాపై ఇంతటి విద్వేషభరితమైన ప్రచారం ఎందుకు చేస్తున్నారో నిజంగా నాకు తెలియదు.
నీకు నా గురించి ఎవరు ఏం చెప్పారు? నాపై ఇలాంటి తప్పుడు ప్రచారానికి నిన్ను ఎలా ఒప్పించారు? ఇవన్నీ నాకు తెలియదు. కానీ.., నీవు వాటిని నమ్మి ఉండకూడదు అన్నది నా అభిప్రాయం. ఎందుకంటే నీకు.. నేను చాలా చాలా సంవత్సరాలుగా తెలుసు.
నీవు కష్ట సమయాల్లో నన్ను ఎన్నో సార్లు సంప్రదించావు? నేను ఎల్లప్పుడూ నీకు నిజాయితీతో సహాయం చేయడానికి ప్రయత్నించాను. ఈ విషయం నీకు కూడా తెలుసు.
నేను ఇవన్నీ నీ నుండి ఏదీ ఆశించి చేయలేదు. నా స్నేహితురాలు సంతోషంగా ఉండాలని, బాగుండాలని చేశాను. కానీ.. ఈరోజున నాపై ఇంతటి విద్వేషభరితమైన ప్రచారం చేస్తావని నేను ఊహించలేదు. నేను నిజంగా షాక్ అయ్యాను.
నాకు నీవు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పిన అన్ని మెసేజులు నా దగ్గర ఉన్నాయి – వాటిలో ఒకటి, కొన్ని నెలల క్రితం, పంపింది:
“వాసు గారు యు ఆర్ ద బెస్ట్. నా మాటగా చెప్పచ్చు, నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను.”
నాకు ఒకప్పుడు తెలిసిన S___కు.. ఏమైందో నిజంగా అర్థం కావడం లేదు.
నీవు ఇటీవల ఐడ్రీమ్ నుండి వెళ్లిపోవడం వ్యక్తిగతం కాదు. అది వృత్తిపరమైన నిర్ణయం. నేను ఆ తర్వాత పంపిన మెసేజ్ లో కూడా దాన్ని స్పష్టంగా పేర్కొన్నాను.
నేను ఎప్పుడైనా సమస్యల్లో ఉంటే.. నీవు నా కోసం ఉంటావని నేను నమ్మాను. ఎందుకంటే అది నీపై నాకు ఉన్న నమ్మకం. ఈ విషయంలో నన్ను కొందరు హెచ్చరించినప్పటికీ నీపై నమ్మకం ఉంచాను.
కొందరు నాకు కాల్ చేసి.. మీపై అసత్య ఆరోపణలు చేయమని స్వప్న, ప్రేమ మాపై ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు. గత 10+ సంవత్సరాల కాలంలో నీలో ఇలాంటి తీరును నేను ఎప్పుడూ చూడలేదు. నాపై ఇంతటి ఉద్దేశ్యపూర్వకమైన తప్పుడు ప్రచారం ఎందుకు?
మీరిద్దరూ తెలుగు డిజిటల్ మీడియాలో మిస్ లీడింగ్ థంబ్ నెయిల్స్ కి వ్యతిరేకంగా పోరాడుతున్నయోధుల్లా మిమ్మల్ని మీరు చిత్రీకరించుకున్నారు. కానీ ఇప్పుడు నీవు ఈ విషయంలో ఐడ్రీమ్ కంటే ఏ మాత్రం బెటర్ గా లేని **** కంపెనీలో చేరావు. నిష్పాక్షికంగా చూసే ఎవరికైనా దీన్ని విస్మరించడం కష్టం.
కొన్ని నెలల తర్వాత.. ఈ విషయాలు అన్నీ నార్మల్ అవుతాయి. అప్పుడు ఈ ఎపిసోడ్ మొత్తంలో నీ తీరుపై ఒక్కసారి ఆలోచించి చూడు. ఆరోజున జరిగిన దానికి నీవు చాలా బ్యాడ్ గా ఫీల్ అవుతావు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే.. ఇది ఎంతో కాలంగా నాకు తెలిసిన S___ తీరులా అనిపించడం లేదు.
ఆరోజు త్వరగా రావాలని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను.
పిఎస్ 1: ఇది ఫిర్యాదు లేఖ కాదు. ఇది కేవలం నేను గత దశాబ్దం పాటు బాగా తెలిసిన వ్యక్తికి నా బాధ, నిరాశను వ్యక్తం చేయడం. నీవు ఐడ్రీమ్ లో నాలుగు సార్లు చేరి, నాలుగు సార్లు బయటకి వెళ్ళావు. ఒక్కసారి కూడా మనం వైరంతోనో, విబేధాలతోనో విడిపోలేదు. మరి.. ఇప్పుడే ఎందుకు ఇలా? నాకు సమాధానం లేదు! P___ నిన్ను ఈ విధంగా ప్రభావితం చేసిందేమో మరి!
పిఎస్ 2: P___కి నాపై ఇంతటి శత్రుత్వం ఎందుకు కలిగిందో నాకు నిజంగా అర్థం కావడం లేదు. P___ తన డిజిటల్ మీడియా కెరీర్ ను 8 సంవత్సరాల క్రితం ఐడ్రీమ్ తోనే ప్రారంభించింది. గత సెప్టెంబర్ లో ఆ వార్షికోత్సవం సందర్భంగా నేను.. P___ను అభినందించాను. ఆ సమయంలో మా మధ్య హృద్యమైన సంభాషణ జరిగింది. ఆ తర్వాత ఏం మారిందో నాకు తెలియదు.
పిఎస్ 3: చివరిగా.. ఈ మొత్తం ప్రచారం నీ సొంత ఇమేజ్ ను కూడా దెబ్బ తీసింది. ఇది ఆలస్యంగా అయినా.. నీకు అర్ధం అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఎవరైనా నీకు ఇలా చేయమని సలహా ఇచ్చి ఉంటే, ఆ ప్రతికూల ప్రభావాల నుండి నీవు దూరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను.
పిఎస్ 4: ఈ మొత్తం వ్యవహారంలో చాలా మంది బాధపడ్డా.. విచిత్రంగా P___మాత్రం తెలివిగా పక్కకి వెళ్ళిపోయిన ఏకైక వ్యక్తిగా కనిపిస్తోంది. ఆమె బహుశా నన్ను మాత్రమే కాకుండా.. అనుకోకుండా నిన్ను కూడా బాధపెట్టింది. అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో ఆమె ఏం సాధిస్తుందో నాకు నిజంగా అర్థం కావడం లేదు.
పిఎస్ 5: నీవు దేవుడిని ఎక్కువగా నమ్ముతావని, దైవ భక్తి ఎక్కువని నాకు తెలుసు. ఒకవేళ నీవు, P___ ఆరోపించినట్టు నేను ఏదైనా ఉద్దేశ్యపూర్వకంగా తప్పు చేసిన వ్యక్తిని అయితే.. ఆ దేవుడే నన్ను జవాబుదారీగా మార్చాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.
హాయ్ P___,
ఇటీవల S___ తన FB వీడియోలో చేసిన వ్యాఖ్యలను నేను చూశాను. అందులో నీవు ఐడ్రీమ్ లో నీ ఇంటర్వ్యూ వీడియోల కోసం ఉపయోగించిన థంబ్ నెయిల్స్ గురించి ఆందోళన వ్యక్తం చేశావని ఆమె చెప్పింది.
నిజానికి నీవు లేదా ఎవరూ నేరుగా ఈ ఆందోళనలను నా దృష్టికి తీసుకురాలేదు. అయినప్పటికీ.. నీ వీడియోలకు ఏవైనా మిస్ లీడింగ్ థంబ్స్ ఉన్నాయో, లేవో నిర్ధారించుకోవడానికి టీమ్ ని క్రాస్ చెక్ చేయమని కోరాను. ఇప్పటివరకు.. వారు ఏదీ సమస్యాత్మకంగా గుర్తించలేదు.
మీ పాత ఇంటర్వ్యూలను తిరిగి ప్రచురించడం గురించి ఆందోళన ఉంటే.. ఈ కంటెంట్ అంతా ఐడ్రీమ్ యాజమాన్యం పరిధిలో ఉంది కాబట్టి, అది మా హక్కులలో భాగమని మరోసారి నీకు తెలియజేస్తున్నాను.
అయితే.. వాటిలో ఎక్కడైనా మిస్ లీడింగ్ థంబ్స్ ఉన్నా, నిన్ను తప్పుగా చిత్రీకరిస్తున్నట్లు అనిపించినా.. మరింకేమైనా అభ్యంతరాలు ఉన్నా దయచేసి వాటిని చూపించమని నేను నిజంగా కోరుతున్నాను. నేను వాటిని వెంటనే పరిష్కరిస్తాను.
ఈ మధ్య కాలంలో ఐడ్రీమ్ కంపెనీ వేగంగా వృద్ధి చెందింది. అలాగే మొదటి నుండి ఎడిటోరియల్ ఎథిక్స్ దాటకుండా మా కంపెనీ ముందుకి పోతుంది. కానీ.. ఇంత పెద్ద వాల్యూమ్ లో కంటెంట్ జనరేట్ చేస్తున్న సమయంలో అనుకోకుండా కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చు. అంతేగాని.. ఉద్దేశ్యపూర్వంకంగా ఎవరినీ ఇబ్బంది పెట్టాలి అన్నది మా అభిమతం కాదు. మేము ఫీడ్ బ్యాక్ ను సీరియస్ గా తీసుకుంటాము. సమస్యలను వెంటనే పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నాము. ఈ విషయంలో నీకు మాట ఇస్తున్నాను.
హృదయపూర్వక నమస్కారములతో,
V___
———
ఇంతకు ముందు చెప్పినట్టు, మేము S___ & P___ తో మాట్లాడటానికి ప్రయత్నించి ఆరు వారాలు పైనే గడిచింది. అయినప్పటికీ వారిద్దరి నుండి ఈ మెసేజ్ లకు ఎటువంటి స్పందన రాలేదు.
కృతజ్ఞతలు,
ఐడ్రీమ్ మీడియా బృందం
17th May 2025