Krishna Kowshik
ఇండస్ట్రీలో ఓ వైపు భాజా భంజత్రీ వార్తలతో అభిమానుల కడుపు నింపేస్తుంటే.. మరో వైపు విడాకులు వార్తలు వినిపిస్తున్నాయి. మెగా ఇంటి వారసుడు వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేశాడు. అంతకు ముందు ఆయన సోదరి నిహారిక విడాకులు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో జంట..
ఇండస్ట్రీలో ఓ వైపు భాజా భంజత్రీ వార్తలతో అభిమానుల కడుపు నింపేస్తుంటే.. మరో వైపు విడాకులు వార్తలు వినిపిస్తున్నాయి. మెగా ఇంటి వారసుడు వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్లు వేశాడు. అంతకు ముందు ఆయన సోదరి నిహారిక విడాకులు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరో జంట..
Krishna Kowshik
మూవీ ఇండస్ట్రీలో కొంత మంది లవ్ బర్డ్స్ వివాహ బంధంలోకి అడుగుపెడుతుంటే.. మరికొంత మంది వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నారు. టాలీవుడ్ రూమర్డ్ కపుల్.. వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి నవంబర్ 1న ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఇక టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలా పాల్ మరో పెళ్లి చేసుకున్న సంగతి విదితమే. ప్రియుడు జగత్ దేశాయ్‌ను వివాహం చేసుకుంది. ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే అన్న పెళ్లికి ముందే మెగా వారసురాలు నిహారిక కొణిదెల, చైతన్యకు విడాకులు తీసుకున్నారన్న వార్త బయటకు వచ్చింది. ఇప్పుడు ప్రముఖ సింగర్ డివోర్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
తన సాంగ్స్‌తో ఉర్రూతలూగించిన పంజాబీ ర్యాపర్ యో యో హనీ సింగ్ వైవాహిక జీవితానికి స్వస్థి పలికారు. తన ఆల్బమ్స్‌తో స్టార్ సింగర్‌గా ఎదిగిన హనీ సింగ్.. తన భార్య షాలిని తల్వార్ నుండి విడాకులు పొందారు. ఈ జంటకు ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. 11 ఏళ్ల మూడు ముళ్ల బంధానికి ఇద్దరి గుడ్ బై చెప్పేశారు. 2011 జనవరిలో హనీ సింగ్-షాలిని వివాహం చేసుకున్నారు. కొన్నాళ్ల పాటు వీరి సంసారం హ్యాపీగానే సాగింది. రెండున్నర ఏళ్లుగా కోర్టులో నలుగుతున్న విడాకుల కేసు.. చివరకు తెగదెంపులు అయ్యింది. అయితే హనీ సింగ్, ఆయన కుటుంబ సభ్యలపై షాలిని గృహ హింస ఆరోపణలు చేసింది.
హనీ సింగ్, అతడి కుటుంబ సభ్యులు తనను మానసికంగా, శారీరకంగా, లైంగికంగా, ఆర్థికంగా హింసకు గురి చేశారంటూ.. విడాకులు కోరుతూ కోర్టు మెట్లెక్కింది. ఈ కోర్టు విచారణలో ఉండగా.. అతడికి వివాహేతర సంబంధాలున్నాయన్న భార్య ఆరోపణలు నిజం చేస్తూ.. 2022 డిసెంబర్‌లో కెనడా నటి, మోడల్ టీనా తడానీతో తన సంబంధాన్ని బహిర్గత పరిచాడు ఈ ర్యాపర్. ప్రస్తుతం హనీ సింగ్ కోసం ఆమె ముంబయి షిఫ్ట్ అయ్యినట్లు తెలుస్తోంది. అతడు బాలీవుడ్ సినిమాల్లో కూడా పాడిన సంగతి విదితమే. టీనా.. ముంబయిలోని మురికి వాడల్లోని అట్టడుగు ఆదాయ వర్గం ఎదుర్కొంటున్న విద్యా పరమైన అసమానతలు, సమస్యలను లెఫ్ట్ ఓవర్స్ అనే షార్ట్ ఫిల్మ్ తీసింది. ఈ సినిమాకు టీనా తెరకెక్కించింది.