Venkateswarlu
దేవర సినిమా షూటింగ్ శరావేగంగా సాగుతోంది. ప్రస్తుతం సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయినట్లు సమాచారం. జనవరిలో జూనియర్ ఎన్టీఆర్-సైఫ్ అలీఖాన్‌ల మధ్య సీన్లను తెరకెక్కించనున్నారట.
దేవర సినిమా షూటింగ్ శరావేగంగా సాగుతోంది. ప్రస్తుతం సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయినట్లు సమాచారం. జనవరిలో జూనియర్ ఎన్టీఆర్-సైఫ్ అలీఖాన్‌ల మధ్య సీన్లను తెరకెక్కించనున్నారట.
Venkateswarlu
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్- దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ‘దేవర’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రస్తుతం శరావేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దేవర రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగం వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీ థియేటర్లలో సందడి చేయనుంది. దేవరలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హీరోయిన్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ‘తంగం’ పాత్రలో పల్లెటూరి లుక్‌లో కనిపించనున్నారు.
ఇక, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా చేస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. దేవర టీం ఎప్పటికప్పుడు అప్‌డేట్లు ఇస్తూ ఉంది. ఎక్కువగా పోస్టర్లు రిలీజ్ చేస్తూ ఉంది. షూటింగ్ ప్రారంభం అయి నెలలు గడుస్తున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంచెం పెద్ద అప్‌డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఫ్యాన్స్‌ను ఖుషీ చేసేందుకు దేవర టీం బిగ్ అప్‌డేట్‌ను వారి ముందుకు తీసుకురానుంది.
అతి త్వరలో టీజర్‌ను విడుదల చేయనుంది. నూతన సంవత్సరం కానుకగా దేవర టీజర్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే గనుక నిజం అయితే, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవ్వటం ఖాయం. టీజర్ విడుదలకు సంబంధించి ఎలాంటి అఫిషియల్ అప్‌డేట్ లేదు. త్వరలో వస్తుందేమో వేచి చూడాలి. కాగా, దేవర సినిమాను మొదటి ఒక భాగంలోనే తీయాలని దర్శకుడు కొరటాల శివ భావించారు. అయితే, ఓ మంచి కథను సింగిల్ మూవీలో చెప్పటం కష్టం అని ఆయన భావించారు.
అందుకే రెండు భాగాలుగా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం చిత్ర షూటింగ్ సగానికిపైగా పూర్తయినట్లు సమాచారం. జనవరిలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో జూనియర్ ఎన్టీఆర్-సైఫ్ అలీఖాన్‌ల మధ్య భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండనున్నాయట. రెండు భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను నభూతోనభవిష్యతి అన్నట్లుగా ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ తెరకెక్కించనున్నారట.
ఈ రెండూ కూడా సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయట. ఇక, తెలుగు మూవీలో నటించటంపై జాన్వీ కపూర్ కొద్దిరోజుల క్రితం స్పందించారు. ఓ బాలీవుడ్ మీడియాతో ఆమె మాట్లాడుతూ.. దేవర తన తొలి తెలుగు సినిమా అని, తనకు తెలుగు రాదని అన్నారు. ఇప్పుడు డైలాగ్స్ నేర్చుకోవటానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నానని చెప్పారు. ఇంట్లో అమ్మ హిందీ, ఇంగ్లీష్‌లోనే మాట్లాడేదని, అప్పుడప్పుడు చెన్నై వెళ్లిపోయినపుడు తమిళంలో మాట్లాడేదని తెలిపారు.
అందుకే తనకు తెలుగు కంటే తమిళమే బాగా తెలుసన్నారు. దేవర సినిమాలో పని చేయటం సొంత గూటికి వచ్చినట్లుగా ఉందని అన్నారు. అమ్మ వారసత్వాన్ని ముందుకు తీసుకెళుతున్నట్లుగా ఉందని తెలిపారు. మరి, నూతన సంవత్సరం కానుకగా దేవర సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుందన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.