iDreamPost
android-app
ios-app

పసిడి ప్రియులకు పండగే.. తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?

మగువలకు గుడ్ న్యూస్. బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. వరుసగా మూడో రోజు దిగివచ్చాయి. బంగారం కొనేందుకు ఇదే మంచి ఛాన్స్. నేడు తులం ఎంతంటే?

మగువలకు గుడ్ న్యూస్. బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. వరుసగా మూడో రోజు దిగివచ్చాయి. బంగారం కొనేందుకు ఇదే మంచి ఛాన్స్. నేడు తులం ఎంతంటే?

పసిడి ప్రియులకు పండగే.. తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?

మీరు బంగారం కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? గోల్డ్ కొనేందుకు రెడీ అవుతున్నారా? అయితే మీకు పండగే. కొన్ని రోజుల క్రితం వరకు చుక్కలుచూపించిన పుత్తడి ధరలు వరుసగా దిగివస్తున్నాయి. తగ్గుతున్న ధరలతో పసిడి ప్రియులకు భారీ ఊరట లభిస్తున్నది. ఓరోజు తగ్గుతూ.. మరో రోజు పెరుగుతూ షాకిచ్చిన బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. బంగారం కొనేందుకు ఇదే మంచి ఛాన్స్. అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకుంటున్న ఒడిదుడుకులు, డాలర్ తో రూపాయి మారకం విలువ పడిపోవడం వంటి కారణాలు పుత్తడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయి. నేడు తులం బంగారంపై ధర ఎంత తగ్గిందంటే?

నేడు తులం బంగారంపై రూ. 10 తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,220గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. రూ.66,240కి చేరుకుంది. విజయవాడ, విశాఖపట్నంలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,370 వద్ద ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. రూ.66,390 అమ్ముడవుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 66,790గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 66,240గా ఉంది.

బంగారం బాటలోనే వెండి పయనిస్తున్నది. వెండి ధరలు కూడా వరసగా దిగివస్తున్నాయి. గతకొన్ని రోజుల నుంచి సిల్వర్ ధరలు పడిపోతున్నాయి. దీంతో సామాన్యులకు భారీ ఊరట లభిస్తున్నది. నేడు సిల్వర్ ధరలు మళ్లీ తగ్గాయి. కిలో వెండిపై రూ. 100 తగ్గింది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి ధర రూ. 95,400 వద్ద అమ్ముడవుతున్నది. విజయవాడలో కిలో వెండి ధర రూ. 95,400వద్ద ట్రేడ్ అవుతున్నది. హస్తినలో కిలో వెండి ధర రూ. 90,900గా ఉంది. ఇక బంగారం వెండి ధరలు వరుసగా దిగివస్తుండడంతో వినియోగదారులు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు.