Tirupathi Rao
Tirupathi Rao
అభిజిత్.. అటు హీరోగానే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో పక్కింటి కుర్రాడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత చెప్పుకోదగ్గ సినిమా అవకాశాలు ఏమీ రాలేదు. కొంత గ్యాప్ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4తో మరోసారి అభిమానులకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత అతని ప్రవర్తన, గేమ్ ఆడిన తీరుతో అభిమానుల సపోర్ట్ తో అఖిల్ సార్దక్ ను వెనక్కి నెట్టేసి బిగ్ బాస్ విన్నర్ గా మారాడు. ఆ తర్వాత అభిజిత్ నుంచి చాలా సినిమాలు వస్తాయి అంటూ చాలా మంది ఎదురుచూశారు. కానీ, అన్నింటిని బ్రేక్ చేస్తూ అభిజిత్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
తనకు తన ఆరోగ్యమే ముఖ్యం అంటూ కామెంట్స్ చేయడం కూడా చూశాం. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టేందుకే సినిమాలకు కాస్త విరామం ప్రకటించినట్లు చెప్పుకొచ్చాడు. అయితే అభిజిత్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన ఫ్యాన్స్ తో ఎప్పుడూ టచ్ లోనే ఉంటూ ఉంటాడు. అతను వెళ్లే వెకేషన్ పిక్స్, ఎంజాయ్ చేస్తున్న సందర్భాలను రీల్స్, ఫొటోస్ రూపంలో పోస్ట్ చేస్తుంటాడు. అయితే గత కొన్ని రోజులుగా అభిజిత్ పెడుతున్న కొత్త పిక్స్, రీల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. అభిజిత్ కొన్న కొత్త సూపర్ బైక్ అది. దాని ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 2023 మోడల్ జీఎస్ ఆర్1250 అడ్వెంచర్ బైక్ ని కొనుగోలు చేశాడు. కొనేసి ఒక నెల అవుతోంది.
అందుకు సంబంధించిన రీల్స్, వీడియోలు కూడా పోస్ట్ చేస్తూ ఉన్నాడు. చాలా మంది అసలు ఆ బైక్ ధర ఎంత? దాని ఫీచర్స్ ఏంటి అంటూ అడిగేస్తున్నారు. ఆ సూపర్ బైక్ ఎక్స్ షోరూమ్ ధర అక్షరాలా.. రూ.22.40 లక్షలు. అవును మీరు చదివింది కరెక్టే. యాడాన్స్, యాక్ససరీస్ అన్నీ కలుపుకుని దాని ఆన్ రోడ్ ధర దాదాపు రూ.25 లక్షలు వరకు ఉంటుంది. మీరు అనుకుంటుంది నిజమే. దాని ధరతో కచ్చితంగా మంచి లగ్జరీ కారు కొనేయచ్చు. కానీ, కొందరికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. వాటిని ఫుల్ ఫిల్ చేసుకోవడానికి ఎంతైనా ఖర్చుపెడతారు. ఇంక సెలబ్రిటీలు ఎందుకు ఆగుతారు చెప్పండి. అలాగే అభిజిత్ తన డ్రీమ్ బైక్ ని కొనేశాడు.
ఇంక ఆ బైక్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ సూపర్ బైక్ 1254 సీసీతో వస్తోంది. దీనిలో ఎయిర్ లిక్విడ్ కూల్డ్, ట్విన్ సిలిండర్ ఇంజిన్ తో ఈ బైక్ వస్తోంది. 6 గేర్ బాక్స్, 76 ఎంఎం స్ట్రోక్, 102.5ఎంఎం బోర్ తో వస్తోంది. ఇందులో కేవలం సెల్ఫ్ స్టార్ట్ మాత్రమే ఉంటుంది. టాప్ స్పీడ్ గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. కేవలం 3.6 సెక్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. లీటరుకు 14 కిలోమీటర్ మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్ బరువు 485 కిలోలు ఉంటుంది. కింద పడితే దీన్ని లేపాలి అంటే కచ్చితంగా బాడీ బిల్డర్ అయి ఉండాలి. అలాగే ఇది 217 కిలోల లోడింగ్ కెపాసిటీతో వస్తోంది. ఇది 30 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తోంది.