Krishna Kowshik
తిరుమలలో దసరా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దసరా సెలవులు రావడంతో అనేక మంది భక్తులు శ్రీవారిని సందర్శించేందుకు తిరుమల చేరుకుంటున్నారు. దీంతో ఇక్కడ రద్దీ నెలకొంది. దీనికి తోడు వీఐపీల తాకిడి కూడ ఎక్కువగా ఉంది.
తిరుమలలో దసరా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దసరా సెలవులు రావడంతో అనేక మంది భక్తులు శ్రీవారిని సందర్శించేందుకు తిరుమల చేరుకుంటున్నారు. దీంతో ఇక్కడ రద్దీ నెలకొంది. దీనికి తోడు వీఐపీల తాకిడి కూడ ఎక్కువగా ఉంది.
Krishna Kowshik
తిరుమల తిరుపతి దేవ స్థానంలో కొలువై ఉన్న కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దసరా సెలవులు కలిసి రావడంతో శ్రీహరిని వీక్షించేందుకు వస్తున్నారు. అలాగే తిరుమలతో జరిగిన బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు ఇక్కడకు క్యూ కడుతున్నారు. దీంతో అక్కడ రద్దీ నెలకొంది. ఇటీవల కాలంలో సెలబ్రిటీల తాకిడి కూడా పెరిగింది. సినీ సెలబ్రిటీలే కాకుండా క్రికెటర్లు కూడా వరుసగా క్యూ కడుతున్నారు. ఆగస్టులో రోహిత్ శర్మ దంపతులు, మాజీ క్రికెటర్లు శ్రీకాంత్, విజయ్ శంకర్ ఆలయాన్ని సందర్శించారు. సెప్టెంబర్‌లో మాజీ టీమిండియా క్రికెటర్, బీజెపీ ఎంపీ గౌతమ్ గంభీర్ సతీ సమేతంగా శ్రీనివాసుడ్ని దర్శించుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో మాజీ క్రికెటర్ తిరుమలను సందర్శించారు.
టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి సన్నిధానానికి వచ్చిన ఆయన.. శ్రీహరిని సందర్శించారు. నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్లొని మొక్కులు చెల్లించుకున్నారు. ఏడుకొండల స్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయ రంగ నాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన భారీ విరాళం ప్రకటించారు లక్ష్మణ్ . ఆలయంలో అలంకరణను చూసి మంత్ర ముగ్దులయ్యారు వీవీఎస్ లక్ష్మణ్.
బ్రహోత్సవాల సందర్భంగా ధ్వజ స్థంభం నుండి శ్రీవారి గర్భాలయం వరకు టీటీడీ ఉద్యానవనం అధికారులు ఫ్లవర్స్ తో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వీటిని తిలకించిన లక్ష్మణ్.. ఒక రోజు అలంకరణకు అయ్యే ఖర్చు రూ. 14 లక్షల రూపాయల చెక్కును టీటీటీ అధికారులకు విరాళంగా అందజేశారు. ఆయన్ను తిలకించేందుకు పెద్ద యెత్తున అక్కడకు వచ్చేశారు. సెల్ఫీలు, ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు.అలాగే ఆయన శ్రీ కాళ హస్తిని కూడా సందర్శించారు. రాహు కేతు క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 1996లో టెస్ట్ క్రికెటర్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఈ హైదరాబాదీ బ్యాటర్.. 2012 రిటైర్ మెంట్ ప్రకటించారు.