iDreamPost
పాఠశాలలోనే విద్యార్థులకు చికిత్స అందించారు. కానీ 40 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా మారింది. వారందరికీ తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు కావడంతో పరిస్థితి విషమిస్తుందని గ్రహించి.. విద్యార్థులను హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా సుమారు 120 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. విషయం బయటికి వస్తే సమస్యాత్మకంగా మారుతుందని భావించిన గురుకుల పాఠశాల సిబ్బంది.. పాఠశాలలోనే విద్యార్థులకు చికిత్స అందించారు. కానీ 40 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా మారింది. వారందరికీ తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు కావడంతో పరిస్థితి విషమిస్తుందని గ్రహించి.. విద్యార్థులను హుటాహుటిన స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
సమాచారం తెలుసుకున్న మంత్రి హరీష్ రావు.. విద్యార్థులు పూర్తిగా కోలుకునేంతవరకూ నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం కొందరు విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. మరికొదరు పాఠశాలలోనే చికిత్స తీసుకుంటున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు, తల్లిదండ్రులు తెలిపారు. సకాలంలో స్పందించి, విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించి ఆదుకున్న మంత్రి హరీష్ రావుకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.