Do You Drink Tea Daily: తరచూ టీ తాగుతున్నారా? అయితే షాకింగ్ న్యూస్ మీ కోసమే!

తరచూ టీ తాగుతున్నారా? అయితే షాకింగ్ న్యూస్ మీ కోసమే!

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో రాత్రి, పగలు అనే తేడా లేకుండా యువతి, యువకులు తీరిక లేకుండా ఆఫీసు పనుల్లొ నిమగ్నమవుతున్నారు. ఈ క్రమంలోనే కాస్త అలసట అనిపించగానే వెంటనే ఓ గ్లాసు టీ, కాఫీ తాగుతుంటారు. ఇక కొంతమంది మాత్రం.. ఉదయం నిద్రలేచిన నుంచి రాత్రి పడుకునే దాక రోజులో కనీసం 4 లేదా 5 సార్లు టీ తాగుతూ ఉంటారు. ఇలా రోజూ టీ తాగేవారికి సింఘావా యూనివర్సిటీ తాజాగా ఓ షాకింగ్ న్యూస్ తెలిపింది. ఈ విషయం తెలుసుకుని చాలా మంది నోళ్లు వెళ్లబెడుతున్నారు.

ఇంతకు సింఘావా యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో ఏం తేలింది? టీ తాగితే వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటనే పూర్తి వివరాలు మీ కోసం. ఈ రోజుల్లో చాలా మందికి ఉదయం నిద్రలేచిన నుంచి రాత్రి నిద్రపోయే వరకు రోజులో కనీసం 5 లేదా 6 సార్లైన టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే టీ తాగే వారి సంఖ్య రోజు రోజుకు అధికమవుతుండంతో చైనాలోని సింఘావా యూనివర్సిటీ టీ తాగే వారిపై ఓ సర్వే నిర్వహించించింది. ఈ సర్వేలో చాలా మటుకు టీ తాగడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయని తెలిపింది.

ప్రధానంగా ఈ అధ్యాయనంలో పాలతో తయారు చేసిన టీ తాగే 5281 మంది యువకులపై పరిశోధన చేసింది. అధికంగా టీ తాగేవారు ఒంటరి తనం, డిప్రెషన్, అలసట, పంటి సమస్యలు, నిరాశతో పాటు ఉభయకాయం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని తేలింది.  దీంతో పాటు మితిమీరిన టీ తాగడం అనేది డ్రగ్స్ మాదిరి ప్రమాదమేనని నిపుణులు తెలిపారు. ఇక నుంచి అధికంగా టీ తాగే వారు కాస్త జాగ్రత్తగా ఉండాలని, టెస్ట్ గా ఉందని గ్లాసు గ్లాసులు తాగితే మొదటికే మోసమోస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ తాగే వారు రోజుకు రెండు, మూడు సార్లకు మించి తాగడం ప్రమాదకరమని తెలియజేస్తున్నారు.

Show comments