Nagendra Kumar
గుంటూరు కారం సినిమా తొలిరోజు కలెక్షన్స్ తో రికార్డులు తిరగరాసింది. ఇప్పుడు ఈ మూవీపై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గుంటూరు కారం సినిమా తొలిరోజు కలెక్షన్స్ తో రికార్డులు తిరగరాసింది. ఇప్పుడు ఈ మూవీపై దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Nagendra Kumar
దిల్ రాజు ఏ సినిమా గురించి మాట్లాడినా నిర్దిష్టమైన అవగాహనతో మాట్లాడతారు అనే పేరుంది ఆయనకి. తను నిర్మించిన సినిమా అయినా, తను పంపిణీ చేసినా సినిమా అయినా సరే నిస్పక్షపాతంగా మట్లాడి, కుండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తారు. ఎన్నోసార్లు సక్సెస్ పర్సంటేజ్ ఆయన కెరీర్లో ఎలా ఉందో చెప్పేటప్పుడు “నేను కూడా ఫ్లాపులు తీశాను. అన్నీ హిట్సే తీయలేదు” అని నిర్మొహమాటంగా చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎందుకీ ప్రత్యేకమైన ఉపోద్ఘాతం దిల్ రాజు గురించి రాయాల్సివచ్చిందంటే.. గుంటూరు కారం సినిమా నైజాం పంపిణీ బాధ్యతలను దిల్ రాజు చేపట్టారు. దాదాపు 90 సింగిల్ స్క్రీన్లలో గుంటూరు కారం చిత్రాన్ని వదిలారు రాజు. ఈ మేరకు హనుమాన్ సినిమాని ఆయన ఉద్దేశ్యపూర్వకంగానే అడ్డుకున్నారు, హనుమాన్ చిత్రానికి గానూ సరైన థియేటర్లు లేకుండా చేశారు అనే నిందలు కూడా పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఇలా రాసినందుకు, తన పైన అపనిందలు వేసినందుకు దిల్ రాజు ఎప్పుడూ లేని విధంగా అలా రాసిన వారిపై ఫైర్ అయ్యారు కూడా.
గుంటూరు కారం సినిమా మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ప్రారంభమైన దగ్గర్నుంచి విపరీతమైన హైప్ ని సొంతం చేసుకుంటూ వచ్చింది. సరే మధ్య మధ్యలో ఏవో లేనిపోని కాంట్రవర్సీలు కూడా తలెత్తాయని కూడా సోషల్ మీడియా దుమ్మెత్తిపోసింది సినిమా మీద. మొత్తం మీద అన్నింటినీ అధిగమించి నిన్న గుంటూరు కారం రిలీజైంది. అనుకున్నంత గొప్పగా లేదు, ఇదసలు త్రివిక్రమ్ బ్రాండే కాదు అని పబ్లిక్ టాక్ ప్రేక్షకులు, అబిమానులు బాహాటంగానే మైకుల ముందు మాట్లాడడం అందరూ చూశారు. మహేష్ బాబు బ్రహ్మాండంగా చేశాడనే స్టాంపుని ప్రిన్స్ నిలబెట్టుకోగలిగారు. కానీ ఇక్కడొక్కటే ప్రాబ్లమ్. అకాశాన్నంటే అంచనాలు ఎప్పుడూ నిరాశ పరుస్తాయి. నీరు గారుస్తాయి. అసలు ప్రేక్షకులు ఏమాశించి థియేటర్లకు వస్తారో కూడా తెలియని సందిగ్ధావస్థ గుంటూరు కారం లాంటి సినిమాలకు ప్రతీసారీ పెద్ద మైనస్ పాయింటే అవుతుంది. అదే ఇప్పుడు కూడా జరిగింది.
కానీ దిల్ రాజు ప్రత్యేకంగా మీడియా మీట్ ని నిర్వహించి మరీ గుంటూరు కారం సినిమా మొదటి షో తర్వాత మిక్సిడ్ రివ్యూస్ వచ్చాయన్న విషయాన్ని ఒప్పుకుంటూ.. మధ్యాహ్నం నుంచి క్రాస్ రోడ్స్ సంధ్యాలాంటి మాస్ థియేటర్స్ లో చెక్ చేస్తే తమ నమ్మకం వమ్ము కాలేదని గట్టిగా బల్లగుద్ది మరీ చెప్పారు దిల్ రాజు. “వేరే చెప్పడానికేం లేదు. నెగెటివ్ కామెంట్స్ తోనే గుంటూరు కారం ప్రారంభమైంది. మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడూ కూడా తమ హీరో సినిమా బాగో లేకపోతే బాగుందని మురిసిపోరు. చాలా చోట్ల మహేష్ బాబు పర్ఫార్మెన్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత ఎర్లీగా సినిమా రిజల్టుని లెక్కకట్టలేం. రాబోయే రోజుల్లో పాజిటివ్ టాక్ తో సినిమా బాగా ఆడుతుందని ఆశిద్దాం’’ అని చెప్పారు దిల్ రాజు. మొదటి రోజు కలెక్షన్లు మాత్రం ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేశాయనే చెప్పాలి. వరల్డ్ వైడ్ మొదటి రోజు కలెక్షన్లు గ్రాస్ పరంగా రూ.94 కోట్లు కలెక్ట్ చేసి.. ఒక ప్రాంతీయ చిత్రం ఇంత వసూలు చేస్తుందా అనే రికార్డుని మాత్రం గుంటూరు కారం సినిమా సొంతం చేసుకుంది.