iDreamPost
iDreamPost
వైఎస్సార్ రైతు భరోసాలో తొలి విడద సాయాన్ని రైతుల ఎకౌంట్లలో సీఎం వైఎస్ జగన్ డిపాజిట్ చేశారు. ఖరీఫ్ పనులు మొదలు కాక మునుపే వైఎస్సార్ రైతు భరోసా అందిస్తున్నామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. రైతులకు ఏటా రూ.13,500 చొప్పున ప్రభుత్వం అందిస్తోందని సీఎం జగన్ చెప్పారు. మేలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4వేలు, జనవరిలో మిగిలిన రూ.2వేలు చొప్పున జమ చేస్తున్నామన్నారు. ఇప్పటిదాకా రైతు భరోసా కింద రూ.23,875 కోట్లు జమ చేశాం. మూడేళ్లలో రైతులకు లక్షా 10వేల కోట్లు ఇచ్చామన్నారు. ఈ రోజు రూ.5,500 నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేస్తున్నామని సీఎం చెప్పారు.
పేరు పెట్టకుండానే పవన్ పై సీఎం జగన్ విమర్శలు దట్టించారు. చంద్రబాబు దత్తపుత్రుడు పరామర్శకు బయల్దేరాడు. పరిహారం అందని ఒక్క రైతును కూడా చూపించలేకపోయాడు. ప్రశ్నించాల్సినప్పుడు ప్రశ్నించకుండా చంద్రబాబుపై దత్తపుత్రుడు ప్రేమ చూపించాడు. ఆనాడు బాబును ఎందుకు ప్రశ్నించలేదు? రైతుకు ఉచిత విద్యుత్, వ్యవసాయం దండగ అన్న నాయకుడు, రైతులపై కాల్పులు జరిపి చంపించిన నాయకుడు చంద్రబాబు. రుణాల పేరుతో మోసం చేసిన నాయకుడి పాలనను గుర్తుచేసుకోవాలని సీఎం జగన్ కోరారు.
మూడేళ్లలో రాష్ట్రంలో కరువు లేదు. ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 16 లక్షల టన్నులు పెరిగింది. గత ప్రభుత్వంలో వడ్డీ లేని రుణాలకు ఐదేళ్లలో చెల్లించింది రూ.782 కోట్లు. మన ప్రభుత్వం మూడేళ్లలో వడ్డీలేని రుణాలకు ఇచ్చింది రూ.1282 కోట్లు. ఏ పంట సీజన్‌లో జరిగిన నష్టానికి అదే సీజన్‌లో పరిహారం ఇస్తున్నామని సీఎం జగన్ చెప్పారు.