కర్ణాటక రాజకీయాల్లో సిడీ వివాదాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవలే మంత్రి రమేష్ జర్కి హోలీ వీడియోలు కలకలం రేపి, ఆయన పదవికి, రాజకీయ జీవితానికి ఎసరు తెస్తే తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప పై కూడా సీడీల వివాదం మూసుకుంటుంది.
కర్ణాటక సీఎం యడియూరప్పపై ఆ పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐదు అసెంబ్లీల ఎన్నికలు పూర్తవగానే ముఖ్యమంత్రిగా ఆయన్ను తొలగిస్తారని ఎమ్మెల్యే బసని గౌడ పాటిల్ యత్నాల్ జోస్యం చెప్పారు. విజయపుర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన సీఎం మార్పుపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించిందని, ఉగాది తర్వాత ఈ మార్పులు ఉండవచ్చని చెప్పారు. దీనికి కారణం సీఎం ఎడ్యూరప్ప కు సంబంధించిన సీడీలు పార్టీలోని చాలామంది వద్ద ఉన్నాయని, వాటిని అధిష్టానం సైతం సీరియస్గా తీసుకుందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే అవి ఎలాంటి సిడిలు వాటిని ఉన్నది ఏమిటి అన్న విషయాలను మాత్రం పాటిల్ బయట పెట్టలేదు. ఆపరేషన్ కమల్ లో పాల్గొన్న 12 మంది బీజేపీ ఎమ్మెల్యేలు వద్ద ముఖ్యమంత్రి యడ్యూరప్పకు సంబంధించిన ఓ రహస్య సిడి ఉందనీ, ఇది ఏ నిమిషంలోనైనా బయటపడవచ్చని పాటిల్ చెప్పడం వెనుక ఏమైనా ప్రత్యేకమైన రాజకీయ వ్యూహం ఉందా అనేది చర్చ జరుగుతోంది. అసలు ఈ ఆపరేషన్ కమల్ విషయంలో ఏం జరిగింది అనేది? ఆ 17 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరు అన్నది కూడా బయట పెట్టకపోవడం ఉత్కంఠకు దారితీస్తోంది.
ఇప్పటికే ఉత్తరాఖండ్ సిఎం మార్పు మీద బీజేపీ దృష్టి సారించి అక్కడ నాయకత్వ మార్పును చేసింది. దాని తర్వాత కర్ణాటక, హర్యానా రాష్ట్రాల ముఖ్యమంత్రి మీద బీజేపీ అధిష్టానం దృష్టి సారించవచ్చు అన్నది కర్ణాటక బిజెపి నేతల మాట. దీనిలో భాగంగానే కర్ణాటక సీఎం మార్పు ఉండవచ్చన్నది వారు చేస్తున్న ప్రచారం. అయితే దీనిలో ఎంత మాత్రం నిజం ఉన్నది లేనిది పక్కనబెడితే కర్ణాటక బిజెపి లో మాత్రం ముసలం రాజుకున్నట్లు అర్థమవుతోంది. ఇటీవల మంత్రి రమేష్ జర్కి హోలీ వివాదం తర్వాత ఒక వర్గం బిజెపి ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రి యడ్యూరప్ప తీరు మీద చాలా కోపంతో ఉన్నారని, సమయం కోసం వేచి చూస్తున్నారని ఇప్పటికే పెద్ద ఎత్తున వార్తాకథనాలు వచ్చాయి. దీనికి సరిపోయేలా ఇప్పుడు బిజెపి ఎమ్మెల్యేలు మాట్లాడడం కర్ణాటక రాజకీయాల్లో కుదుపుకు సంకేతంగా కనిపిస్తుంది.
బసన గౌడ పాటిల్ బిజెపి సీనియర్ నేత గా రెండుసార్లు లోక్సభకు, రెండుసార్లు మంత్రిగానూ కర్ణాటకలో పనిచేశారు. విజయపుర జిల్లా లో కీలకమైన నేతగా ఉన్నారు. బీజేపీ అధిష్టానం తోనూ ఢిల్లీ పెద్దలతో ఆయనకు మంచి పరిచయాలు ఉన్నాయి. మరోపక్క ఆర్ఎస్ఎస్ పెద్దలతో సఖ్యత గా ఉంటారు అని పేరు ఉన్న పార్టీలు వ్యాఖ్యలు ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో పెను సంచలనం అవుతున్నాయి. అసలు సీఎం మీద ఉన్న కీలకమైన సి డి లు ఏమిటి అన్నది? ఆయన మార్గం మీద బిజెపి ఆలోచిస్తుంద అన్నది కూడా రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమవుతోంది.