రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు బ్రేక్ – అనుకున్నది సాధించిన టీడీపీ

నిన్నటి నుంచి ఉత్కంఠత రేపుతున్న రాజధాని వికేంద్రీకరణ బిల్లును శాసనమండలి చైర్మన్ సెలెక్ట్ కమిటీ కి పంపారు. దీనితో రాజధాని వికేంద్రీకరణ బిల్లును రెండు సభల ఆమోదంతో త్వరితగతిన చట్టం చెయ్యాలనుకున్న ప్రభుత్వం ఆలోచనకు స్పీడ్ బ్రేకర్ పడినట్లయింది.

సెలెక్ట్ కమిటీకి కనిష్టంగా ఒక నెల, గరిష్టంగా మూడు నెలల గడుపు ఉంటుంది. నిర్దిష్ట గడువు లోపు సెలెక్ట్ కమిటీ బిల్లును పరిశీలించి తమ అభిప్రాయాన్ని మండలికి తెలియచేయవలసి ఉంటుంది.

సెలెక్ట్ కమిటీ సభ్యులును ప్రభుత్వం నియమిస్తుంది కాబట్టి ఇబ్బంది ఉండకపోవచ్చు.

మరో వైపు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపే అధికారం చైర్మన్ కు లేదని మంత్రులు సభలో వాదిస్తున్నారు. రాజ్యాంగం ప్రకారం చైర్మన్ కు శాసనసభ స్పీకర్ కు ఉన్నట్లు ఎలాంటి విశేష అధికారాలు లేవు.దీనితో చైర్మన్ నిర్ణయం మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

శాసనసభ,మండలి సమావేశాలు రేపు కూడా జరగవలసి ఉంది కానీ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిన చైర్మన్ మండలిని నిరవధిక వాయిదా వేశారు.. దీనితో రేపు మండలి సమావేశం జరగటాని అవకాశం లేదు.. టీడీపీ కోరుకున్నట్లు భాగంగానే రూల్ 71,సెలెక్ట్ కమిటీ ,నిరవధిక వాయిదా … ఈ పరిణామాలు చూస్తే మండలి పని తీరు మీద అనుమానాలు కలగక మానవు.

Show comments