Pravallika Case: మరో మలుపు తిరిగిన ప్రవళిక కేసు.. ఏం జరిగిందంటే?

మరో మలుపు తిరిగిన ప్రవళిక కేసు.. ఏం జరిగిందంటే?

నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు మా కూతురి మరణాన్ని రాజకీయం చేయొద్దని కోరారు. ఇది మరువక ముందే తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.

నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు మా కూతురి మరణాన్ని రాజకీయం చేయొద్దని కోరారు. ఇది మరువక ముందే తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.

ప్రవళిక ఆత్మహత్య కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. గ్రూప్ 2 వాయిదా పడడంతోనే ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడిందని మొదట్లో ప్రతిపక్షాలు, విద్యార్థులు ఆరోపించాయి. ఇంతే కాకుండా అశోక్ నగర్ లో విద్యార్థులతో కలిసి యువతికి న్యాయం చేయాలంటూ ర్యాలీ నిర్వహించాయి. ఈ క్రమంలోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అంతా పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి.. ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలపడంతో అంతా షాక్ గురయ్యారు.

గతంలో శివరామ్ రాథోడ్ అనే యువకుడిని ప్రేమించిందని, ప్రియుడు మోసం చేయడం కారణంగానే ఆ యువతి ఆత్మహత్య చేసుకుందని నిర్ధారించారు. దీంతో పోలీసులు ఎట్టకేలకు శివరామ్ ను అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో ప్రవళిక సోదరుడు, తల్లి ఓ వీడియోను విడుదల చేశారు. శివరామ్ రాథోడ్ వేధంపుల కారణంగానే ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు మా కూతురి మరణాన్ని రాజకీయం చేయొద్దని కోరారు. ఇది మరువక ముందే తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మా కుమారుడిని కావాలని ఈ కేసులో ఇరికించారని శివరామ్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని రాష్ట్ర మానవ హక్కల కమిషన్ ను ఆశ్రయించారు.

Show comments