iDreamPost
iDreamPost
ఓలా బైక్ వచ్చింది. హిట్ కొట్టింది. దేశీయంగా బ్యాటరీల తయారీతో 25శాతం మేర రేట్లు తగ్గించడానికి ప్లాన్స్ వేస్తోంది. కాబట్టి, మరింత సేల్స్ పెరగడం ఖాయం. ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కారును విడుదల చేయనుంది. ఓలా ఎలక్ట్రిక్, తన మొదటి ఎలక్ట్రిక్ కారును ఆగస్టు 15న మధ్యాహ్నం 2 గంటలకు ఆవిష్కరించనున్నట్లు సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు.
ఓలా ఎలక్ట్రిక్ కారు గురించి ఇప్పటిదాకా పెద్దగా డిటైల్స్ లేవు. ప్లానింగ్ గురించి తెలుసు అంతే. యేడాది కాలంలోనే ఓలా ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ ట్విట్టర్ ఖాతాలో రాబోయే ఎలక్ట్రిక్ వాహనం టీజర్ వీడియోలను షేర్ చేశారు. ఆగస్ట్ 15, 2022న మధ్యాహ్నం 2 గంటలకు కంపెనీ ఒక ముఖ్యమైన ప్రకటన చేయనుందని అగర్వాల్ రాశారు. పోస్ట్‌తో పాటు రెడ్ కలర్ కారును చూపించే చిన్న వీడియో కూడా ఉంది “చిత్రం అభి బాకీ హై మేరే దోస్త్” అని క్యాప్షన్ ఇచ్చారు.
Picture abhi baaki hai mere dost😎
See you on 15th August 2pm! pic.twitter.com/fZ66CC46mf
— Bhavish Aggarwal (@bhash) August 12, 2022
ఇంతకుముందు పోస్ట్ లో “వీల్స్ ఆఫ్ ది రివల్యూషన్”, ఓలా రాబోయే ఎలక్ట్రిక్ కారు వెనుక భాగం ఎలా ఉంటుందో చిన్న వీడియోలో ప్రదర్శించారు. ఆ వీడియో చూడండి.
Wheels of the revolution! pic.twitter.com/8zQV3ezj6o
— Bhavish Aggarwal (@bhash) August 13, 2022
కొన్నివారాలుగా ఓలా ఎలక్ట్రిక్ కారు గురించి టీజింగ్ డిటైల్స్ ఇస్తూనే ఉంది. ఆగస్ట్ 15న భారీ ప్రకటన ఉండబోతోందని అనడానే అందరూ కారు గురించేనని అనుకున్నారు. ఇప్పుడది నిజం కాబోతోంది.
Ola Electric Car రేంజ్ 500కిలోమీటర్లు. ఒకసారి కనుక ఫుల్ గా చార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు బిందాస్ గా డ్రైవ్ చేయొచ్చునని ఓలా వర్గాలు చెబుతున్నాయి.