Krishna Kowshik
తెలంగాణలో ఎన్నికల జోరు మొదలైంది. నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఈ సమయంలోనే మాటలు దొర్లుతుంటాయి. అవి సమస్యలు తెచ్చిపెడుతుంటాయి
తెలంగాణలో ఎన్నికల జోరు మొదలైంది. నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. అయితే ఈ సమయంలోనే మాటలు దొర్లుతుంటాయి. అవి సమస్యలు తెచ్చిపెడుతుంటాయి
Krishna Kowshik
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ ఈ నెల 3న విడుదల కానుంది. ఏ పార్టీకా పార్టీ గెలుపు తమదంటే తమదని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తమదైన స్టైల్లో ప్రచారాలను హోరెత్తిస్తున్నాయి. అధికార/ప్రతిపక్షాలు ఇప్పటికే అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేసేశాయి. మేనిఫెస్టోలను హామీలతో రంగరిస్తున్నాయి. ఇదే సమయంలో జాబితాలో సీటు రాని అభ్యర్థులు.. అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. మరో పార్టీకి జంప్ చేసేస్తున్నారు. అలాగే అధికార పార్టీపై విమర్శలు, ప్రతిపక్షానికి కౌంటర్లు వచ్చేస్తున్నాయి. ఈ సమయంలో మాటలు దొర్లుతుంటాయి. పుసుక్కున నోరు జారుతుంటారు. ఇప్పుడు ఓ రాజకీయ నేత ఏకంగా ఆ పార్టీ పెద్దపైనే నోరు జారి వార్తల్లో నిలిచారు.
అతడు మరెవ్వరో కాదూ తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీనుద్దేశించి మాట్లాడుతూ నోరు జారారు. ’శాంతి కోసం శ్రీలంకకు శాంతి సేనలను పంపించింది రాహుల్ గాంధీ.. అక్కడ చనిపోయిందీ రాహుల్ గాంధీ‘ అంటూ మాట్లాడేశారు. రాజీవ్ గాంధీ అనబోయి రాహుల్ గాంధీ అంటూ సంబోధించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. అయితే అద్దంకి దయాకర్ ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదూ. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని దూషించిన సంగతి విదితమే.