లాల్ సింగ్ చద్దా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్, కాని ఆస్కార్ ప్యానెల్ దృష్టిలో గ్రేట్ సినిమా!

బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ పూర్. ఇక రివ్యూలంటారా? అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమా మీద ఎలాంటి దయ చూపలేదు. విదేశాల్లో కాస్త బెట‌ర్. ఇండియాలో లాల్ సింగ్ క‌లెక్ష‌న్స్ లో కిందామీద‌ప‌డుతుంటే, ఆస్కార్ అకాడమీ అవార్డు ప్యానెల్ పోస్ట్ చేసిన మాత్రం లాల్ సింగ్ ను గొప్ప‌గా చూపించింది.

లాల్ సింగ్ చద్దా బాక్స్ ఆఫీస్ వద్ద 1 వ రోజు నీర‌స‌మైన క‌లెక్ష‌న్స్ వ‌స్తే, 2 వ రోజు మరింత దెబ్బ‌తింది. కాని 3వ రోజు మాత్రం 30శాతం మేర క‌లెక్ష‌న్స్ పెరిగాయి. అలాగ‌ని ఇదేమంత గొప్ప‌కాదు. ఈ రెండు రోజుల్లో మ‌రికొంత క‌లెక్ష‌న్స్ పెరిగితేకాని, కొంతైనా లాల్ సింగ్ తేరుకొనేలా లేడు. అస‌లు అడ్వాన్స్ బుకింగ్ మీద ఆడియ‌న్స్ లో ఆస‌క్తిలేదు. మొదటి రోజే థియేట‌ర్లు ఖాళీ. ₹12 కోట్ల నికర ఓపెనింగ్ అంటే ట్రేడ్, ఫిల్మ్ ఇండస్ట్రీ అంతటా షాక్. బాలీవుడ్ అల్ల‌ల్లాడిపోయింది. అమీర్ ఖాన్ తో బాలీవుడ్ తేరుకుటుంద‌ని అంచ‌నావేస్తే, రెండో రోజు ₹7.50 కోట్ల నికర వసూళ్లతో మ‌రో షాక్. బాలీవుడ్ నిట్ట‌నిలువునా నీర‌సించిపోయింది. ఇలా లాల్ సింగ్ చద్దాకు నిరాశ క‌లిగించే వార్త‌ల మ‌ధ్య ఆస్కార్ ప్యానెల్ నుండి ప్ర‌శంస‌లు ద‌క్కాయి.

లాల్ సింగ్ చద్దాను ఫారెస్ట్ గంప్ యొక్క “విశ్వసనీయ రిమేక్ ” అని పిలుస్తూ, అకాడమీ అవార్డ్ ప్యానెల్ శనివారం, 13 ఆగస్టు నాడు తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ పోస్ట్ చేసింది. ” రాబర్ట్ జెమెకిస్ , ఎరిక్ రోత్ తీర్చిదిద్దిన దయతో ప్రపంచాన్ని మార్చే వ్యక్తి యొక్క కథకు అద్వైత్ చందన్, అతుల్ కులకర్ణి సినిమా ‘లాల్ సింగ్ చద్దా ఒక‌ నమ్మకమైన భారతీయ అనుసరణ. టామ్ హాంక్స్ విఖ్యాతం చేసిన‌ పాత్రలో అమీర్ ఖాన్ న‌టించారు. ట్వీట్ చూడండి.


ఇండియాలో క‌లెక్ష‌న్స్ కోసం కిందామీదా ప‌డుతున్నా, విదేశాల్లో మాత్రం లాల్ సింగ్ చ‌ద్దా బెట‌ర్ గానే ఆడుతోంది. ఆగస్ట్ 3, 13వ తేదీన విడుదలైనప్పుడు, ఢిల్లీ, NCR, తూర్పు పంజాబ్, ముంబై వంటి కొన్ని చోట్ల మాత్ర‌మే రిలీజ్ అయ్యింది. ఇప్పుడు హై-ఎండ్ మల్టీప్లెక్స్‌ల సంఖ్యను పెంచుతోంది. కాని, మాస్ స‌ర్య్కూట్ గా చెప్పే UP, బీహార్, గుజరాత్ , రాజస్థాన్‌తో సహా చోట్ల‌ అమీర్ ఖాన్ సినిమాకు షోల‌ను ర‌ద్దుచేస్తున్నారు.

Show comments