సిల్వర్ స్క్రీన్ పై రామ్ మందిర్ వేడుక.. ఆ మల్టీప్లెక్సుల్లో చూసే అవకాశం!

Ayodhya Ram Mandir Inauguration at PVR and INOX: అయోధ్యకు వెళ్లి రామ్ మందిర్ ప్రారంభోత్సవాన్ని వీక్షించలేని వారికి గుడ్ న్యూస్. ఆ మల్టీ ప్లెక్సుల్లో రామ్ మందిర్ ప్రారంభోత్సవ లైవ్ ను చూసే అవకాశం కల్పిస్తున్నాయి.

Ayodhya Ram Mandir Inauguration at PVR and INOX: అయోధ్యకు వెళ్లి రామ్ మందిర్ ప్రారంభోత్సవాన్ని వీక్షించలేని వారికి గుడ్ న్యూస్. ఆ మల్టీ ప్లెక్సుల్లో రామ్ మందిర్ ప్రారంభోత్సవ లైవ్ ను చూసే అవకాశం కల్పిస్తున్నాయి.

రామ భక్తులు ఎంతగానో ఎదురు చూస్తున్న రామ్ మందిర్ ప్రారంభోత్సవానికి సమయం ఆసన్నమైంది. దేశ ప్రజలకు కోదండ రాముని దర్శనభాగ్యం మరికొన్ని గంటల్లో కలుగనున్నది. ఈ నెల 22న అంగరంగ వైభవంగా అయోధ్యలో రామ్ మందిర్ ప్రారంభోతవ్సవం జరుగనున్నది. ఈ వేడకుకు అన్ని రంగాలకు చెందిన అతిరథ మహారథులు దేశ విదేశాల నుంచి హాజరు కాబోతున్నారు. ఇప్పటికు రామ భక్తులు రైళ్లు, బస్సులు, విమానాల ద్వారా అయోధ్యా నగరానికి చేరుకుంటున్నారు. అయితే అయోధ్యకు వెళ్లి వీక్షించలేని వారికి గుడ్ న్యూస్. ఆ మల్టీ ప్లెక్సుల్లో రామ్ మందిర్ ప్రారంభోత్సవ లైవ్ ను చూసే అవకాశం కల్పిస్తున్నాయి. ఇంతకీ ఆ మల్టీ ప్లెక్సులు ఏవంటే?

శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టతో చారిత్రాత్మక ఘట్టానికి తెరలేవనుంది. ఈ అరుదైన క్షణాలను వీక్షించేందుకు రామ భక్తులు సిద్ధమవుతున్నారు. అయితే అయోధ్యకు నేరుగా వెళ్లలేని వారు టీవీల్లో చూసే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై కూడా రామ్ మందిర్ ప్రారంభోత్సవ లైవ్ వేడుకలను చూడొచ్చు. రాముడి పండుగను చూసే అవకాశం కల్పిస్తున్నాయి ప్రముఖ మల్టీప్లెక్స్‌ సంస్థలు పీవీఆర్‌, ఐనాక్స్‌. ఈ విషయాన్ని పీవీఆర్ సినిమాస్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది.

దేశంలోని 70 ప్రధాన నగరాల్లోని 170 కంటే ఎక్కువ కేంద్రాల్లో అయోధ్య రాముడి పండగను ప్రత్యక్ష ప్రసారం చేసందుకు పీవీఆర్‌, ఐనాక్స్ ఏర్పాట్లు చేశాయి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బిగ్‌ స్క్రీన్‌పై ఈ రామ్ మందిర్ ప్రారంభోత్సవ లైవ్ ను వీక్షించవచ్చు. కాగా ప్రతి టిక్కెట్ పై కూల్‌ డ్రింక్స్‌, పాప్‌కార్న్ కూడా అందిస్తున్నట్లు వెల్లడించారు. కాటా టికెట్లు పీవీఆర్, ఐనాక్స్ అధికారిక వెబ్‌ సైట్లు, మూవీ టికెట్‌ బుకింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అయినటువంటి బుక్‌ మై షో, పేటీఎంలల్లో టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు. మరి మల్టీప్లెక్సుల్లో అయోధ్య రామ్ మందిర్ ప్రారంభోత్సవాన్ని లైవ్ స్క్రీనింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments