P Venkatesh
ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ విజయవంతమైంది. సొరంగంలో చిక్కుకుపోయిన కూలీలను సురక్షితంగా బయటికి తీసుకొస్తున్నారు రెస్క్యూ బృందాలు. ఈ క్రమంలో మొదట 5 మంది కూలీలను బయటికి తీసుకువచ్చారు.
ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ విజయవంతమైంది. సొరంగంలో చిక్కుకుపోయిన కూలీలను సురక్షితంగా బయటికి తీసుకొస్తున్నారు రెస్క్యూ బృందాలు. ఈ క్రమంలో మొదట 5 మంది కూలీలను బయటికి తీసుకువచ్చారు.
P Venkatesh
ఉత్తరాఖండ్ లోని సిల్క్ యారా టన్నెల్ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. రెస్క్యూ టీమ్ సొరంగం నుంచి ఐదుగురు కూలీలను బయటికి తీసుకు వచ్చారు. బయటికి వచ్చిన వారిని సత్వరమే వైద్య చికిత్స అందించేందుకు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఇందుకోసం ముందుగానే ఘటనా స్థలి వద్ద 41 అంబులెన్స్ లను సిద్దంగా ఉంచారు అధికారులు. బాధితులను ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు హెలికాఫ్టర్లను కూడా సిద్ధంగా ఉంచారు. మిగతా కూలీలందరు బయటికి వచ్చేందుకు అర్ధరాత్రి కావొచ్చని అధికారలు వెల్లడిస్తున్నారు. కాగా ఈ నెల 12న నిర్మాణంలో ఉన్న సొరంగంపై కొండచరియలు విరిగిపడడంతో సిల్క్యారా టన్నెల్ లో పనిచేస్తున్న కూలీలు చిక్కుకు పోయారు.
ప్రమాదం జరిగిన నాటి నుంచి కూలీలు అందులోనే చిక్కుబడి పోయారు. దాదాపు 17 రోజుల నిరీక్షణ తర్వాత సురక్షితంగా బయటికి రావడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం రెస్క్యూ నిర్వహించి కూలీల ప్రాణాలను కాపాడారు. వారిని సురక్షితంగా బయటికి తీసుకు వచ్చేందుకు రెస్క్యూ టీమ్స్ అలుపెరుగని పోరాటం చేశాయి. సొరంగంలో కూలిన శిథిలాలకు భారీ యంత్రాలతో డ్రిల్ చేసుకుంటూ రెస్క్యూ టీమ్స్ ముందుకు కదిలి ఎట్టకేలకు కూలీల ప్రాణాలను నిలిపారు.
ప్రమాదం జరిగిన నాటి నుంచి నేటి వరకు రెస్క్యూ టీమ్స్ శక్తి వంచన లేకుండా పనిచేశాయి. కూలీలను సురక్షితంగా బయటికి తీసుకురావడమే లక్ష్యంగా రాత్రింభవళ్లు శ్రమించారు. అంతర్జాతీయ నిపుణులను సైతం పిలిపించారు. ఈ క్రమంలో రెస్క్యూ చేస్తున్న సమయంలో అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ కారణంతో కూలీలను బయటికి తీసుకురావడం మరింత ఆలస్యమైంది. టన్నెల్ లో చిక్కుకుపోయిన వారికి ఆక్సీజన్, ఆహార పదార్థాలను అందిస్తూ అధికారులు కంటికి రెప్పలా కాపాడుకొచ్చారు. అన్ని ప్రయత్నాలు ఫలించడంతో నేడు కూలీలు క్షేమంగా బయటికి వచ్చారు. దీంతో బాధితుల కుటుంబాల్లో సంతోషం వెల్లువిరిసింది.
#WATCH | The first worker among the 41 workers trapped inside the Silkyara tunnel in Uttarakhand since November 12, has been successfully rescued. pic.twitter.com/Tbelpwq3Tz
— ANI (@ANI) November 28, 2023