P Venkatesh
US visa Appointment: భారతీయులకు అగ్రరాజ్యం అమెరికా గుడ్ న్యూస్ అందించింది. వారి కోసం ఏకంగా 2.5 లక్షల వీసా అపాయింట్ మెంట్స్ ను ప్రకటించింది. దీంతో ఆ కష్టాలకు చెక్ పడినట్లే అవుతుంది.
US visa Appointment: భారతీయులకు అగ్రరాజ్యం అమెరికా గుడ్ న్యూస్ అందించింది. వారి కోసం ఏకంగా 2.5 లక్షల వీసా అపాయింట్ మెంట్స్ ను ప్రకటించింది. దీంతో ఆ కష్టాలకు చెక్ పడినట్లే అవుతుంది.
P Venkatesh
అమెరికా.. ఇది యువత కలల రాజ్యం. యూఎస్ వెళ్లి చదువుకోవాలని ఆలోచిస్తుంటారు. డాలర్లలో సంపాదించి కాలర్ ఎగరేయాలని కలలుకంటుంటారు. అందుకే చాలామంది ఉన్నత చదువుల కోసం యూఎస్ కు వెళ్తుంటారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఫారిన్ లో చదివించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఖర్చు ఎక్కువైనా పర్వాలేదు.. బెస్ట్ ఫ్యూచర్ ఇవ్వాలని భావిస్తుంటారు. దీంతో ప్రతి ఏటా అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్య వేలల్లో ఉంటుంది. స్టూడెంట్స్ యూఎస్ లో హైయ్యర్ ఎడ్యుకేషన్ చేసి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటున్నారు. భారతీయ విద్యార్థులు అమెరికాలో తమ సత్తాచాటుతున్నారు. దిగ్గజ కంపెనీలకు సీఈవోలుగా నియమితులై రాణిస్తున్నారు. దేశ ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటుతున్నారు.
ఈ నేపథ్యంలో అమెరికా భారతీయులకు తీపికబురును అందించింది. యూఎస్ వెళ్లాలనుకునే వారికి ఇది భారీ ఊరట అనే చెప్పొచ్చు. భారతీయుల కోసం అమెరికా 2.5 లక్షల వీసా అపాయింట్ మెంట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది. దీంతో వీసాల కోసం ఎదురుచూసే కష్టాలకు చెక్ పడినట్లే అని అంతా భావిస్తున్నారు. అమెరికా వెళ్లాలనుకునే పర్యాటకులకు నైపుణ్యం కలిగిన కార్మికులతో పాటు స్టూడెంట్స్ కు ఇవి దోహదం చేస్తాయని చెప్పుకొచ్చింది భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం. యూఎస్ వెళ్లే భారత ప్రయాణికులకు ఈ వీసా అపాయింట్ మెంట్స్ ప్రయోజనకరంగా ఉండనున్నాయి.
ఈ మేరకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. తాజాగా రిలీజ్ చేసిన స్లాట్‌ల వల్ల వేలాది మంది భారతీయులు సకాలంలో ఇంటర్వ్యూలు పొందడానికి హెల్ప్ అవుతుంది. అమెరికా- భారత్ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రయాణాన్ని సులభతరం చేస్తుందని తెలిపింది. వరుసగా రెండో ఏడాది కూడా పది లక్షలకు పైగా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా అపాయింట్‌మెంట్లను యూఎస్ ఎంబసీ చేపట్టింది.
అలాగే, గతేడాది మాదిరిగానే ఈసారి కూడా భారీ సంఖ్యలో విద్యార్థి వీసాలు జారీ చేయబోతున్నట్లు అమెరికా రాయబార కార్యాలయం చెప్పుకొచ్చింది. 2023లో మాత్రం 1.4 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ కు వీసాలు ఇచ్చింది అమెరికా. 2024లో ఇప్పటి వరకు 1.2 మిలియన్లకు పైగా భారతీయులు యునైటెడ్ స్టేట్స్‌కు వెళ్లారు. ఆరు మిలియన్ల మంది భారతీయులు ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్‌ను సందర్శించడానికి వలసేతర వీసాను కలిగి ఉన్నారు. ఈ విషయంపై భారత్ లోని యుఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టీ మాట్లాడుతూ “ప్రధాని నరేంద్ర మోడీ, అధ్యక్షుడు జో బిడెన్ వీసా ప్రక్రియను మెరుగుపరచడానికి, వేగవంతం చేయడానికి ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించారు. మేము ఆ వాగ్దానాన్ని నెరవేర్చామని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను” అని తెలిపింది.