ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లి రౌడీయిజం.. పొలంలో తుపాకీతో రైతుని..

Trainee IAS Puja Khedkar Mother Rowdyism: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ కుటుంబం చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రౌడీయిజం, అక్రమాస్తులను కూడబెట్టుకోవడం ఇలా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పూజా ఖేద్కర్ తల్లి పొలంలో తుపాకీతో రైతుని..

Trainee IAS Puja Khedkar Mother Rowdyism: ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ కుటుంబం చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రౌడీయిజం, అక్రమాస్తులను కూడబెట్టుకోవడం ఇలా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పూజా ఖేద్కర్ తల్లి పొలంలో తుపాకీతో రైతుని..

అధికారం ఉంది కదా అని అడ్డంగా పడి దోచుకోవడం.. రౌడీయిజం చేసి అమాయకులను బెదిరించడం వంటివి చేస్తే కర్మ చూస్తూ ఊరుకోదు. ఏదో ఒకరోజు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తుంది. ప్రస్తుతం పూజా ఖేద్కర్ కుటుంబం విషయంలో అదే జరుగుతుంది. అధికారం ఉందని సర్వీసులో ఉన్నంత కాలం దోచుకున్నారు. అడ్డం వచ్చిన వారిని బెదిరించారు. పొలాలు  లాక్కోవాలని చూశారు. దొరకనంత వరకూ దొరల్లా బతికిన వారి అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మహారాష్ట్ర ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్, ఆమె కుటుంబ సభ్యులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్ని అకృత్యాలకు పాల్పడ్డారో ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. పూజా ఖేద్కర్ తండ్రి దిలీప్ ఖేద్కర్ ఐఏఎస్ గా పని చేసి రిటైర్ అయ్యారు.

అయితే ఆయన సర్వీసులో ఉండగా అవినీతికి పాల్పడ్డారని.. కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకున్నారని వార్తలు వచ్చాయి. పూజా ఖేద్కర్ కుటుంబం ఆస్తుల విలువ రూ. 40 కోట్లు కాగా.. మార్కెట్ విలువ 100 కోట్ల పైనే ఉంటుందని కథనాలు వచ్చాయి. ఇదిలా ఉంటే పూజా ఖేద్కరే అనుకుంటే ఆమె తల్లి కూతుర్నే మించిపోయింది. గతంలో రైతుల మీద రౌడీయిజానికి పాల్పడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రైతులను తుపాకీతో బెదిరిస్తోంది. పూజా ఖేద్కర్ తండ్రి దిలీప్ ఖేద్కర్ అక్రమంగా సంపాదించిన డబ్బుతో 25 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ స్థలం చుట్టుపక్కల ఉన్న రైతుల భూములను ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు.

దీంతో రైతులు తీవ్ర ఆరోపణలు చేశారు. గొడవ పెద్దదవ్వడంతో పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్ రైతుల పొలాల దగ్గరకు సెక్యూరిటీ గార్డులతో వెళ్లి రైతులను బెదిరించింది. తుపాకీ పట్టుకుని.. ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో చూపించు అంటూ బెదిరించింది. దానికి వీడియోలో ఉన్న రైతు.. తన పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ అయి ఉందని.. కోర్టులో కేసు నడుస్తోందని జవాబిచ్చారు. దీంతో మనోరమ ఖేద్కర్.. కోర్టు ఇచ్చిన ఆర్డర్ చూసుకో.. నాకు ఏ రూల్స్ చెప్పకు అంటూ తుపాకీతో రైతుని బెదిరించింది. తుపాకీ పట్టుకుని రైతుని బెదిరించిన వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఆమెపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు.  కాగా పూజా ఖేద్కర్ పై వస్తున్న ఆరోపణలు నిజం అని తేలితే ఆమెను సర్వీస్ నుంచి సస్పెండ్ చేసేందుకు కేంద్రం యోచిస్తున్నట్లు టాక్. మరి అధికారాన్ని అడ్డుపెట్టుకుని పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్ అమాయక రైతుని బెదిరిస్తున్న తీరుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

Show comments