బుల్డోజర్ కూల్చివేతలపై సుప్రీం కోర్టు సీరియస్!

Supreme Court: దేశ వ్యాప్తంగా ఇటీవల బుల్డోజర్ యాక్షన్ బాగా పెరిగిపోయాయి. నేరస్తులకు గుణపాఠంగా ఉంటుందని బుల్డోజర్ కూల్చివేత కార్యక్రమం మొదలు పెట్టాయి ప్రభుత్వాలు. తాజాగా బుల్డోజర్ యాక్షన్ పై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

Supreme Court: దేశ వ్యాప్తంగా ఇటీవల బుల్డోజర్ యాక్షన్ బాగా పెరిగిపోయాయి. నేరస్తులకు గుణపాఠంగా ఉంటుందని బుల్డోజర్ కూల్చివేత కార్యక్రమం మొదలు పెట్టాయి ప్రభుత్వాలు. తాజాగా బుల్డోజర్ యాక్షన్ పై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

గత కొన్నిరోజులుగా దేశంలో పెరుగుతున్న బుల్డోజర్ చర్యలపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో బుల్డోజర్ యాక్షన్ పై వచ్చిన పిటీషన్లపై బుధవారం (నవంబర్ 13) సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలోనే కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితులు చేసిన తప్పిదాలకు శిక్షగా అప్పటికిప్పుడు బుల్డోజర్ న్యాయం అందించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేవలం ఆరోపణలతో ఏకపక్షంగా పౌరుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయడం రాజ్యంగ చట్టాన్ని, అధికారుల విభజన సూత్రాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని తెలిపింది. శిక్ష పేరుతో అధికారులు చట్ట విరుద్దంగా పౌరుల ఆస్తులను కూల్చివేయడం సరికాదని సుప్రీం కోర్టు చెప్పింది. నిందితులపై చర్యలు తీసుకునే ముందు న్యాయపరమైన విచారణ జరగాలని సుప్రీం కోర్టు పేర్కొంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బుల్డోజర్ యాక్షన్ పై సుప్రీం కీలక తీర్పుఇచ్చింది.  అధికారులే ఆస్తులను లీగల్, ఇల్లీగల్ అని నిర్ధారించి చర్యలు తీసుకోవడం తప్పుబడుతూ బుధవారం సంచలన తీర్పు చెప్పింది. ఇటీవల పలు రాష్ట్రాల్లో నేరాలు చేసిన వారి ఇళ్లు, అక్రమంగా కబ్జా చేసిన వారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్నిసార్లు అధికారుల చర్యల వల్ల బాధితులు తీవ్ర ఇబ్బందులు పడటమే కాదు.. ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వెలుగు చూశాయి. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ‘బుల్డోజర్ చర్యల’పై పిటిషన్లు రాగా దీనిపై విచారణ కొనసాగించింది. ఇలాంటి కూల్చివేతల కార్యక్రమాలతో అధికారులు హీరోయిజాన్ని చూపించే ప్రయత్నాలు చేయవొద్దని హెచ్చరించింది. నిందితుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయడం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో నిందితుల ఇళ్లను కూల్చివేసే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. మనది లౌకిక దేశమని, మతాలకు అతీతంగా అందరికీ తమ మార్గదర్శకాలు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.ప్రజల భద్రతే అత్యంత ముఖ్యమని తెలిపింది. అక్రమ నిర్మాణాలపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా బుల్డోజర్ కూల్చివేతలకు మార్గదర్శకాలు జారీ చేసింది. సరైన విధానం పాటించకుండా నిర్మాణాలను కూల్చివేయడం రాజ్యంగ విరుద్దమని తెలిపింది.

ఇకపై బుల్డోజర్ యాక్షన్ తీసుకోవాలంటే 15 రోజుల ముందస్తు నోటీసులు తప్పకుండా ఇవ్వాలి. నోటీసులను మూడు నెలల్లోపు డిజిటల్ పోర్టల్ లో ఉంచాలి. కూల్చివేతలు తప్పని సరి అయితే దానికి గల కారణాలు స్పష్టంగా వివరించారు. నోటీసులను రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాలి. కూల్చి వేత సమయంలో వీడియోగ్రఫీ చేయాలి.. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కోర్టు దిక్కారం అవుతుంది. నష్టపరిహారంగా అధికారుల జీతం నుంచి జరిమానా వసూలు చేస్తామని సుప్రీం సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ లో సీఎంగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్యాంగ్‌స్టర్స్, మాఫియా ఇతర నేరాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏదైనా నేరాలకు పాల్పపడిన వారికి గుణపాఠంగా ఉంటుందని వారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయిస్తున్న విషయం తెలిసిందే. ఈ చర్యల వల్ల నేరం చేసిన వారితో పాటు అన్యాయంగా వారి కుటుంబ సభ్యులు కూడా శిక్ష అనుభవిస్తునానరని విమర్శలు వెల్లువెత్తాయి. ఇల్లు లేక రోడ్డు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని బాధితులు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు ‘హైడ్రా’ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే హైడ్రా కూల్చి వేతలపై పలు వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే.

Show comments