P Krishna
Fastest Trip on Delhi and Hyderabad Metro: ప్రపంచంలో ఎవరూ చేయలేని అసాధ్యమైన పనులు చేస్తూ అందరినీ అబ్బుర పరిచిన వారికి వరల్డ్ గిన్నీస్ రికార్డు లో స్థానం దక్కుతుంది.
Fastest Trip on Delhi and Hyderabad Metro: ప్రపంచంలో ఎవరూ చేయలేని అసాధ్యమైన పనులు చేస్తూ అందరినీ అబ్బుర పరిచిన వారికి వరల్డ్ గిన్నీస్ రికార్డు లో స్థానం దక్కుతుంది.
P Krishna
మనిషి అనుకుంటే ఏదైనా సాధిస్తాడు.. దానికి కృషీ, పట్టుదల ఎంతో అవసరం. ప్రపంచంలో చాలా మంది ఎవరూ చేయలేని.. అసాధ్యమైన పనులు చేస్తూ వరల్డ్ రికార్డు సృష్టిస్తుంటారు. అలాంటి వారు గిన్నిస్ రికార్డులో తమ పేరు నమోదు చేసుకుంటారు. కొంతమంది ఆ రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుంటారు. ఢిల్లీకి చెందిన శశాంక్ అనే ఓ యువకుడు ఫ్రీలాన్స్ పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు. మొదటి నుంచి ఇతరులకు భిన్నంగా ఏదో ఒకటి చేస్తూ పేరు తెచ్చుకోవాలని కోరిక అతడిలో ఉండేది. ఈ క్రమంలోనే మెట్రోలో ప్రయాణించి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఢిల్లీకి చెందిన శశాంక్ కి మొదటి నుంచి మెట్రోలో ప్రయాణించడం అంటే ఎంతో ఇష్టం. అంతేకాదు.. ఊరికే మెట్రోలో ప్రయాణిస్తే ఏమోస్తుంది.. ఏదైనా ఒకటి చేసి గిన్నిస్ రికార్డు సంపాదించాలన్నదే అతని ఆశయం. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ మెట్రోలో ప్రయాణించి గిన్నిస్ రికార్డు సొంత చేసుకున్నాడు. అయితే శశాంక్ కేవలం ఢిల్లీ మెట్రోతోనే తనప్రయాణం ఆపలేదు. ఇప్పుడు హైదరాబాద్ మెట్రోలో ఈ తరహా రికార్డు క్రియేట్ చేయాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవు.. హైదరబాబాద్ చేరుకున్నాడు శశాంక్. హైదరాబాద్ లో మెట్రో ట్రైన్ లో మూడు కారిడార్లలో 57 స్టేషన్లలో 2 గంటల 41 నిమిషాల 31 సెకన్లలో ప్రయాణించి గిన్నీస్ రికార్డు కైవసం చేసుకున్నాడు. హైదరాబాద్ లో అన్ని మెట్రో స్టేషన్ లలో అత్యంత వేగంగా ప్రయాణించి ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు శశాంక్. గతంలో స్టేషన్లన్నీ 15 గంటల 22 నిమిషాల్లో ప్రయాణించి రికార్డు సృష్టించాడు శశాంక్. ప్రపంచ వ్యాప్తంగా భారత దేశంలో మెట్రో సేవలు, సౌకర్యాలు ప్రోత్సహించడానికే శశాంక్ మెట్రో నగరాల్లో ఇటువంటి ప్రయాణాలు చేస్తున్నానని తెలిపాడు. అంతేకాదు అతి తక్కువ గంటల్లో ప్రయాణించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డస్ సొంతం చేసుకోవడం తన అభిలాష అంటున్నాడు. 2021, ఏప్రిల్ 14న ఉదయం 5 గంటలకు మెట్రో బ్లూ లైన్ నుంచి తన ప్రయాణం మొదలు పెట్టాడు. అలా ఢిల్లీ మెట్రో గ్రీన్ లైన్ సమీపంలో ఉన్న బ్రిగేడియర్ హుషియర్ సింగ్ స్టేషన్ వద్ద రాత్రి 8:30 గంటలకు తన మెట్రో ప్రయాణాన్ని పూర్తి చేశాడు. ఆ రోజు ఢిల్లీ మెట్రోలోని 286 స్టేషన్లను సందర్శించినట్లు పేర్కొన్నాడు.అయితే ఢిల్లీ, హైదరాబాద్ మెట్రో ప్రయాణం పూర్తి చేసిన శశాంక్.. నెక్ట్స్ టార్గెట్ బెంగుళూరా అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.