బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ.. ఏ టైమ్ కి? ఆ రెండు నిమిషాలే ప్రధానం!

బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగనున్నది. రామ్ మందిర్ ప్రారంభోత్సవ వేళ దేశమంతా రామనామంత మారుమ్రోగిపోతోంది. మరి ఈ వేడుకలను తిలకించేందుకు నేరుగా అయోధ్యకు వెళ్లలేని వారు లైవ్ చూసే అవకాశం కల్పిస్తోంది.

బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగనున్నది. రామ్ మందిర్ ప్రారంభోత్సవ వేళ దేశమంతా రామనామంత మారుమ్రోగిపోతోంది. మరి ఈ వేడుకలను తిలకించేందుకు నేరుగా అయోధ్యకు వెళ్లలేని వారు లైవ్ చూసే అవకాశం కల్పిస్తోంది.

శతాబ్ధాల చరిత్ర ఉన్న అయోధ్యలో నేడు చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యా నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అయోధ్యా రామ్ మందిర్ ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగా బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగనున్నది. రామ్ మందిర్ ప్రారంభోత్సవ వేళ దేశమంతా రామనామంత మారుమ్రోగిపోతోంది. రామ భక్తులు అయోధ్యలో కొలువుదీరనున్న కోదండరాముని దర్శన భాగ్యం కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ వేడుకలను తిలకించేందుకు నేరుగా అయోధ్యకు వెళ్లలేని వారు లైవ్ చూసే అవకాశం కల్పిస్తోంది. ఈ రోజు ఆ సమయం నుంచి ఆ యూట్యూబ్ ఛానల్ లో వీక్షించవచ్చు.

అయోధ్య రామ్ మందిర్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రామ భక్తులు ప్రత్యక్ష ప్రసారంలో చూసి తరించొచ్చు. బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని కనులారా వీక్షించి జన్మదన్యం చేసుకోవచ్చు. ఇంతకీ లైవ్ లో ఎక్కడ చూడొచ్చంటే.. దూరదర్శన్ ఛానల్, యూట్యూబ్ లో అయోధ్య చారిత్రాత్మక ఘట్టాన్ని చూడొచ్చు. ఈ ఛానల్ లో నేడు ఉదయం 11 గంటల నుంచి 4కేలో ప్రత్యక్ష ప్రసారం కొనసాగనున్నది. దీని కోసం అయోధ్య ప్రాంగణంలో 40 అత్యాధునిక కెమెరాలను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఆ రెండు నిమిషాలు మాత్రం ప్రధానంగా మారనున్నాయి. రామ్ మందిర్ గర్భగుడిలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట జరిగే ఆ రెండు నిమిషాల క్రతువు ఎంతో ప్రధానం.

పండితుల వేదమంత్రోఛ్చారణల మధ్య జరిగే బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఎంతో కీలకం అని పండితులు, మునులు, రుషీశ్వరులు వెల్లడిస్తున్నారు. ఈ సమయంలోనే విగ్రహానికి దైవ శక్తులు ఆవహిస్తాయని పండితులు తెలుపుతున్నారు. శ్రీరాముడు అభిజిత్‌ ముహూర్తంలో జన్మించారని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఈ అభిజిత్ మూహూర్తం అనేది ఉదయం 11.51 నుంచి 12:33 మధ్యాహ్నం వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు. కాగా బాల రాముని ప్రణ ప్రతిష్ట నేడు 12 గంటల 29 నిమిషాల నుంచి 12 గంటల 31 నిమిషాల మధ్యలో జరుగనున్నది. అంతేకాకుండా హిందూ పంచాగ ప్రకారం జనవరి 22న మృగశిర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ నక్షత్రం ఎంతో పవిత్రమైనదిగా హిందూవులు భావిస్తారు. ఈ నక్షత్రంలో చేపట్టిన పనులు ఎంతో శుభప్రదం. అలాగే విజయాన్ని ప్రసాదిస్తుందని భారతీయుల నమ్మకం.

Show comments