ట్రైనీ IAS ఓవర్ యాక్షన్.. మేడమ్ కోరికలు మాత్రం మాములుగా లేవు!

Pune Trainee IAS.. దేశంలోనే అత్యంత గౌరవప్రదమైన ఉద్యోగాల్లో ఒకటి కలెక్టర్. ఈ హోదాకు రావాలంటే ఎంతో కృషి, పట్టుదల ఉంటేనే సాధ్యం. కలెక్టర్ అంటే ప్రభుత్వం తరుఫున సేవ అందించడమే కాదు.. ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరిస్తుంటారు. కానీ ఈ IAS మాత్రం..

Pune Trainee IAS.. దేశంలోనే అత్యంత గౌరవప్రదమైన ఉద్యోగాల్లో ఒకటి కలెక్టర్. ఈ హోదాకు రావాలంటే ఎంతో కృషి, పట్టుదల ఉంటేనే సాధ్యం. కలెక్టర్ అంటే ప్రభుత్వం తరుఫున సేవ అందించడమే కాదు.. ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరిస్తుంటారు. కానీ ఈ IAS మాత్రం..

చిన్నప్పుడు చాలా మంది మీరు ఏం అవుతారురా అంటే ఫస్ట్ ఛాయిస్ కలెక్టర్ అనే చెబుతారు. ఆ తర్వాత టీచర్, డాక్టర్, ఇంజనీరింగ్, పైలట్ ఆప్షన్స్ వెతుకుతారు. కలెక్టర్ ఏం చేస్తాడో ఎలాంటి అధికారాలు ఉంటాయో తెలియని వయస్సులోనే ఆ అధికారిపై ఎనలేని గౌరవం ఉండిపోతుంది. కలెక్టర్ అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే కాదు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరిస్తుంటారు. కానీ పెద్దయ్యాక చాలా తక్కువ మంది మాత్రమే కలెక్టర్స్ అవుతుంటారు. ఎంతో అకుంఠిత దీక్ష, పట్టుదల ఉంటేనే యుపీఎస్సీ క్రాక్ చేయగలుగుతారు. ఐఏఏస్, ఐపీఎస్ సాధించడం అంటే ఓ తపస్సులాంటిదేనని చెప్పొచ్చు. అంత ఉన్నతమైన పదవిలో ఉండాల్సిన ఓ మహిళా ట్రైనీ కలెక్టర్.. అత్యుత్సాహం వల్ల చివరకు డీమోషన్ పొందింది.

2023 ఫలితాల్లో యుపీఎస్సీ ఫలితాల్లో 841 ఆల్ ఇండియా ర్యాంక్ సాధించింది పూజా ఖేద్కర్. ఆమె ప్రస్తుతం ట్రైనీ కలెక్టర్‌గా వ్యవహరిస్తోంది. అయితే ఆమె చేసిన ఓ తప్పు విమర్శలు పాలు కావడంతో రాష్ట్ర ప్రభుత్వమే చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె మహారాష్ట్రలోని పూణెలో ట్రైనీ ఐఏఎస్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ప్రస్తుతం ప్రొబేషన్ పీరియడ్ నడుస్తుంది. ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడింది. పూజా తనకు ప్రత్యేక అధికారాలు కావాలంటూ కలెక్టర్ కార్యాలయానికి లేఖ రాసింది. దీంతో విమర్శల పాలయ్యింది. తన ప్రైవేట్ ఆడికారును రెడ్ అండ్ బ్లూ లైట్ వినియోగించడంతో పాటు వీఐపీ నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకుని, దానిపై మహారాష్ట్ర ప్రభుత్వం అనే బోర్డును కూడా అమర్చుకుంది.

అంతేకాదు కోరికల చిట్టా విప్పింది. అనుమతి లేని డిమాండ్లు చేసింది. వీఐపీ నంబర్ ప్లేట్ ఉన్న అధికారిక కారు, వసతి, తగిన సిబ్బందితో అధికారిక ఛాంబర్, కానిస్టేబుల్ ఇవ్వాలంటూ లేఖలో పేర్కొంది. పూజా అక్కడితో ఆగితే పోయేది. కానీ అదనపు కలెక్టర్ అజయ్ మోర్ లేని సమయంలో ఆ ఛాంబర్ కూడా ఆక్రమించి.. తన పేరుతో బోర్డు పెట్టుకుంది. అదనపు కలెక్టర్ ముందస్తు అనుమతి లేకుండా కుర్చీలు, సోఫాలు, టేబుల్స్ సహా అన్ని మెటీరియల్ తొలగించింది. అనంతరం తన పేరు మీద లెటర్ హెడ్, విజిటింగ్ కార్డ్, పేపర్ వెయిట్, నేమ్ ప్లేట్, రాజముద్ర, ఇంటర్ కామ్ అందించాలని రెవెన్యూ అసిస్టెంట్ కు ఆదేశాలు జారీ చేసింది.

అంతేనా పూజా తండ్రి (రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి) సైతం తన కూతురి డిమాండ్లు నెరవేర్చాలంటూ ఒత్తిడి తెచ్చాడు. చివరకు ఆమె డిమాండ్లు తట్టుకోలేక పూణె కలెక్టర్ సుహాస్ దివాసే.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఆమె చర్యలతో విస్తుపోయిన మహారాష్ట్ర ప్రభుత్వం.. ఆమెను పూణె నుండి వాషిమ్‌కు బదిలీ చేసింది. అంతేకాదు తన ప్రొబెషనరీ పీరియడ్ ముగిసే వరకు.. వాషిమ్‌లో సూపర్ న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మిగిలిన ప్రొబెషనరీ పీరియడ్ అంతా  ఆ బాధ్యతల్లోనే కొనసాగాలని పేర్కొంది.

Show comments