Prayagraj: కుంభమేళ వేళ యోగి సర్కార్ సరికొత్త ప్రయోగం.. ఇక రాత్రిళ్లు కూడా పగలే!

Prayagraj Kumbh Mela 2025: వచ్చే ఏడాది ప్రయాగరాజ్ మహా కుంభమేళ జరగనుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చక్కచక్కగా చేస్తుంది. ఇదే సమయంలో యోగి సర్కార్ ఓ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

Prayagraj Kumbh Mela 2025: వచ్చే ఏడాది ప్రయాగరాజ్ మహా కుంభమేళ జరగనుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చక్కచక్కగా చేస్తుంది. ఇదే సమయంలో యోగి సర్కార్ ఓ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.

ప్రయాగరాజ్ లో జరిగే మహా కుంభమేళా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతుంటాయి. 2025లో ప్రయాగరాజ్ లో మాహా కుంభమేళా జరగనుంది. వచ్చే ఏడాది జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు ఈ  కుంభమేళ జరగనుంది. ఇందుకోసం ఇప్పటి నుంచే యూపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కుంభమేళాకు సంబంధించిన పనులు యుద్ధప్రాతిపదికన సాగుతున్నాయి. ఈ క్రమంలోనే రాత్రులు కూడా భక్తులకు ఏ చిన్న అసౌకర్యం కలగకుండా ఉండేదు.. యోగి సర్కార్ సరికొత్త ప్రయోగం చేస్తుంది.

యోగి ప్రభుత్వం ఆలోచన మేరకు కుంభమేళా జరిగే ప్రాంతంలో కరెంట్, రోడ్లు, నీరు వంటి మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో విద్యుత్ శాఖ కూడా పలు కొత్త విధానాలను అమలు చేస్తోంది. ప్రయాగరాజ్ జరిగే కుంభమేళా పరిధిని పెంచడంతో పాటు అక్కడ సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. 4000 హెక్టార్లలో ప్రయాగరాజ్ కుంభమేళ విస్తరించనుంది. గతంలో కంటే ఈసారి విద్యుత్ సరఫరా విధానం భిన్నంగా ఉండనుదని స్థానిక అధికారులు చెబుతున్నారు. పూర్వాంచల్ విద్యుత్ పంపిణీ సంస్థ చీఫ్ ఇంజనీర్ ప్రమోద్ కుమార్ సింగ్ కీలక విషయాలను వెల్లడించారు. ఈ మహా కుంభమేళా కోసం రూ.391.04 కోట్లతో శాశ్వత, తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఈసారి కుంభమేళాలో విద్యుత్ కోతల బెడద లేకుండా చూసేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు.  ఈ మేరకు సౌరశక్తితో నడిచే హైబ్రిడ్ సోలార్ లైట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మొత్తం 2004 హైబ్రిడ్ సోలార్ లైట్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రయాగ రాజ్ లో కుంభమేళా జరిగే ప్రాంతంలోని ప్రధాన కూడళ్లు, వంతెనల వద్ద  ఈ లైట్లను ఏర్పాటు చేస్తారు. ఈ లైట్ల కారణంగా కుంభమేళా ప్రాంతంలో రాత్రులు కూడా పగలే అన్నట్లు ఉంటుంది. పూర్వాంచల్ విద్యుత్ పంపిణీ సంస్థ వివరాల ప్రకారం.. కుంభమేళా ప్రాంతంలో 85 తాత్కాలిక విద్యుత్ సబ్ స్టేషన్లు, 85 డీజిల్ జనరేటర్లు, 42 కొత్త ట్రాన్స్‌ ఫార్మర్లను ఏర్పాటు చేయనున్నారు.

కుంభమేళాప్రాంతంలోని శిబిరాల్లో వెలుతురు కోసం 67 వేల స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేస్తారు. శిబిరాలు, రోడ్ల వెంబడి ఏర్పాటు చేసే ఈ లైట్లతో కుంభమేళా జరిగే ప్రాంతమంతా వెలుగులతో నిండిపోతుంది… రాత్రిళ్లు కూడా పగలులా వెలుతురు ఉంటుందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. ఇలా ప్రయాగరాజ్ మహా కుంభమేళాను యూపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరి.. కుంభమేళ విషయంలో యూపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments