దేశంలోనే తొలి రైస్ ATM.. ఇక ఎక్కడైనా బియ్యం తీసుకోవచ్చు

Indias First Rice ATM At Bhubaneswar: ఏటీెఎం అనగానే డబ్బులు డ్రా చేయడానికి అని మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ ఇక మీదట.. మీరు ఏటీఎం నుంచి మనీనే కాదు.. బియ్యం డ్రా చేసుకోవచ్చు. ఆ వివరాలు..

Indias First Rice ATM At Bhubaneswar: ఏటీెఎం అనగానే డబ్బులు డ్రా చేయడానికి అని మాత్రమే గుర్తుకు వస్తుంది. కానీ ఇక మీదట.. మీరు ఏటీఎం నుంచి మనీనే కాదు.. బియ్యం డ్రా చేసుకోవచ్చు. ఆ వివరాలు..

ఏటీఎం అనగానే.. డబ్బులు డ్రా చేయడమే గుర్తుకు వస్తుంది. కానీ ఇక మీదట ఏటీఎం ముందు జనాలు బస్తాలు పట్టుకుని నిలబడటం చూడొచ్చు. అంతేకాదండోయ్.. ఏటీఎం లోపలి నుంచి బియ్యంతో బయటకు వచ్చే సీన్ కూడా కనిపించవచ్చు. అదేంటి.. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తాము కానీ.. ఇలా బియ్యం రావడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. అవునండి ఇకపై ఏటీఎం సెంటర్ల నుంచి బియ్యం డ్రా చేసుకోవచ్చు. దేశంలోనే తొలి రైస్ ఏటీఎంను ఏర్పాటు చేశారు. మరి ఇది ఎక్కడ ఉంది.. బియ్యం ఎలా డ్రా చేస్తారో ఇక్కడ తెలుసుకుందాం..

దేశంలోనే తొలిసారిగా రైస్ ఏటీఎంను ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ప్రారంభించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా రేషన్ కార్డు ఉన్న వాళ్లు ఈ ఏటీఎం ద్వారా 25 కిలోల వరకు బియ్యాన్ని పొందవచ్చు. ఒడిశా రాష్ట్ర ఆహార సరఫరా, వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి కృష్ణ చంద్ర పాత్ర నిన్న అనగా గురువారం నాడు ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో ఈ రైస్ ఏటీఎంను ప్రారంభించారు.

మరి ఈ ఏటీఎం ద్వారా బియ్యాన్ని ఎలా డ్రా చేస్తారంటే.. ముందుగా కార్డుదారుడు బయోమెట్రిక్ చేసిన అనంతరం ఏటీఎం స్క్రీన్‌పై రేషన్ కార్డు నెంబరు ఎంటర్ చేస్తే 25 కేజీల వరకు బియ్యాన్ని పొందవచ్చు. రేషన్ దుకాణాల వద్ద భారీ క్యూలను నివారించేందుకు ఈ ఏటీఎంను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసినట్లు చంద్ర పాత్ర చెప్పుకొచ్చారు.

అంతేకాదు ఈ రైస్ ఏటీఎం ద్వారా కేవలం నిజమైన లబ్దిదారులు మాత్రమే ఈ బియ్యం తీసుకునే వీలు కలుగుతుందని మంత్రి చెప్పుకొచ్చారు. ఈ రైస్ ఏటీఎం ఆలోచన వల్ల బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్టు పడటమే కాక.. బియ్యం కొలిచే సమయంలో ఎలాంటి మోసాలు, జరిగే అవకాశంం లేదని మంత్రి స్పష్టం చేశారు. పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ ఏటీఎం ఏర్పాటు చేశామని, దేశంలోనే తొలి రైస్ ఏటీఎం ఇదేనని మంత్రి పేర్కొన్నారు.

అంతేకాక త్వరలోనే ఒడిశాలోని 30 జిల్లాల్లో ఈ తరహా ఏటీఎంలను ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. ఇది విజయవంతమైతే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఒన్ నేషన్ ఒన్ కార్డు పథకంలో భాగంగా విస్తరించవచ్చని అన్నారు. వీటిని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు ఎక్కడ కావాలంటే అక్కడ బియ్యం తీసుకోవచ్చునని మంత్రి కృష్ణ చంద్ర అభిప్రాయపడ్డారు.

వాస్తవానికి 2022లోనే అప్పటి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఈ తరహా రైస్ ఏటీఎంలను ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. ఇందుకోసం 2021లో ప్రపంచ ఆరోగ్య కార్యక్రమం (డబ్ల్యూపీఎఫ్)తో అవగాహన ఒప్పందం కుదురుచ్చుకుంది.  కానీ ఆచరణలోకి రాలేదు.

Show comments