VIDEO:మంత్రిపై పసుపు చల్లిన వ్యక్తి! ఎందుకో తెలుసా?

మాములుగా రాజకీయ నాయకులపై కొందరు ప్రజలు ఇంకు చల్లడం, కోడి గుడ్లతో దాడి చేయడం అనేది ఇప్పటికీ మనం చాలా ఘటనల్లో చూశాం. నేతలు చెప్పిన హామీలు అమలు చేయకపోయినా.., ప్రజల సమస్యలను పరిష్కరించకపోయినా, వారితో దరుసుగా ప్రవర్తించినా.. అలాంటి సమయాల్లో ప్రజలు నేతలకు ఎదురు తిరిగి వారిపై ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారు. అయితే అచ్చం ఇలాగే వ్యవహరించాడు ఓ వ్యక్తి. ఓ సమస్య విషయమై మంత్రిని కలవడానికి వెళ్లి అతనిపై తలపై పసుపు చల్లాడు. పక్కనే ఉన్న ఆ మంత్రి అనుచరులు, గన్ మెన్స్ అతడిని పక్కకు లాక్కెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. ఇంతకు ఆ వ్యక్తి మంత్రిపై ఎందుకు పసుపు చల్లాడు? ఈ ఘటన ఎక్కడ జరిగిందనే పూర్తి వివరాలు మీ కోసం.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్ తాజాగా షోలాపూర్ జిల్లాలోని ప్రభుత్వ విశ్రాంతి గృహానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకుని స్థానిక ప్రజలు తమ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని అనుకున్నారు. ఇక అందరిలాగే శేఖర్ బంగాలే అనే వ్యక్తి కూడా వెళ్లి అతనిని కలిశాడు. ఇంతే కాకుండా ఓ లేఖను కూడా మంత్రికి ఇచ్చాడు. వెంటనే ఆ మంత్రి ఆ లేఖను చదువుతుండగానే.. శేఖర్ బంగాలే తన జేబులోంచి పసుపు తీసి మినిస్టర్ రాధాకృష్ణ విఖే పాటిల్ తలపై చల్లాడు. అప్రమత్తమైన మంత్రి గన్ మెన్స్, అనుచరులు పసుపు చల్లిని వ్యక్తిని పక్కకు లాక్కెళ్లారు.

ఇంతటితో ఆగకుండా అతడిపై పిడిగుద్దలతో దాడికి దాగారు. మంత్రి వెంటనే స్పందిస్తూ.. అతన్ని ఏం చేయొద్దంటూ వారికి చెప్పాడు. ఆ తర్వాత పసుపు చల్లిన శేఖర్ బంగాలే అనే వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ.. మా కమ్యూనిటీ (ST)వర్గం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకే ఇలా చేశానని, ఇకనైనా స్పందించి మా కమ్యూనిటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ చేయని పక్షంలో ముఖ్యమంత్రి, మరికొంత మంది మంత్రులపై కూడా నల్లటి రంగు చల్లుతానని కూడా హెచ్చరించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియలో కాస్త వైరల్ గా మారుతోంది.

Show comments