Krishna Kowshik
రైల్వే వ్యవస్థలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.. వేగంగా గమ్య స్థానాలకు చేర్చే వందే భారత్ వంటి రైళ్లు వస్తున్నాయి. కానీ కొన్ని విషయాల్లో తీరు మారడం లేదు.
రైల్వే వ్యవస్థలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.. వేగంగా గమ్య స్థానాలకు చేర్చే వందే భారత్ వంటి రైళ్లు వస్తున్నాయి. కానీ కొన్ని విషయాల్లో తీరు మారడం లేదు.
Krishna Kowshik
దేశంలో రైల్వే వ్యవస్థ ఇప్పుడిప్పుడే అప్ గ్రేట్ అవుతుంది. సూపర్ ఫాస్ట్ సర్వీసు, మెట్రో సర్వీసులతో పాటు గంటల్లో గమ్యస్థానం చేర్చే వందే భారత్ రైళ్లను తీసుకు వచ్చింది. సుమారు 25 రైళ్లను ఇప్పటి వరకు ప్రారంభించారు ప్రధాని మోడీ. వేగంగా దూసుకెళుతూ.. తక్కువ సమయంలో డెస్టినేషన్ చేరుకుంటున్నాయి ఈ రైళ్లు. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న ఈ ట్రైన్లకు డిమాండ్ పెరిగింది. కంఫర్టబులిటీ సీటింగ్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ అందిస్తుండటంతో ఈ రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది. ఇన్ని సదుపాయాలు కల్పిస్తున్న రైల్వే వ్యవస్థ.. ఆహారం విషయంలో మళ్లీ అవే తప్పిదాలు చేస్తుంది. వినియోగదారులకు అందించే ఆహారం విషయంలో మరోసారి అభాసుపాలు అయ్యింది రైల్వే.
రైళ్లలో ప్రయాణీకులకు దుర్వాసనతో కూడిన ఆహారాన్ని అందిస్తూ.. తరచూ వార్తల్లో నిలుస్తోంది ఇండియన్ రైల్వే. కీటకాలు, పురుగుల కనిపించాయంటూ ఇప్పటికే పలువురు ప్యాసెంజర్లు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. కానీ ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. వందే భారత్ వంటి క్లాస్టీ ట్రైన్లలో కూడా ఇలాంటి తప్పిదాలే దొర్లాయి. తాజాగా ఓ ప్రయాణికుడికి సర్వ్ చేసిన యోగార్టులో ఫంగస్ కనిపించింది. దీంతో అవాక్కైన ప్యాసింజర్.. వాటిని ఫోటోలు తీసి.. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. హర్షద్ తోప్కర్ అనే యువకుడు.. డెహ్రడూన్ నుండి ఢిల్లీలోని ఆనంద్ విహార్‌కు వందే భారత్‌లోని ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో ప్రయాణించాడు. అతడు ఫుడ్ ఆర్డర్ చేశాడు.
అందులో అమూల్ యోగార్ట్ క్యాప్ తీసి చూడగా..గ్రీన్ లేయర్ లాంటి చూసి షాక్ అయ్యాడు. అదొక ఫంగస్ అని గుర్తించాడు. అయితే వందే భారత్ లాంటి రైళ్లలో ఇలాంటి అనుభవం ఎదురౌతుందని తాను అస్సలు ఊహించలేదు అంటూ రాసుకొచ్చాడు. అలాగే తన ట్వీట్‌ను రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్, రైల్వే మంత్రిత్వ శాఖకు ట్యాగ్ చేశాడు. ఈ విషయం రైల్ సేవ దృష్టికి రావడంతో వివరాలు పంచుకోవాలని ప్రయాణీకుడ్ని కోరింది. అదే సమయంలో ఐఆర్‌సీటీసీ కూడా స్పందించింది. ‘ మీ అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఈ విషయం వెంటనే ఆన్ బోర్ట్ సూపర్ వైజర్ కి చేరుకుంది. వెంటనే యోగార్ట్‌ను మార్చివేశారు. పెరుగు ప్యాక్ కూడా గడువు తేదీ లోపుదే. ఈ సమస్యను తయారీదారుల దృష్టికి తీసుకెళతాం’ అంటూ పేర్కొంది. ఇది చూసిన నెటిజన్ల ఇక వందేభారత్ తీరు మారదు అంటూ మాట్లాడుకుంటున్నారు.
@RailMinIndia @RailwayNorthern @AshwiniVaishnaw
traveling to Vande Bharat from Dehradun to Anad vihar in the executive class today. Found greenish layer most probably fungus in the amul yogurt served. This is not expected from the Vande Bharat service pic.twitter.com/ScwR1C0rlz— Harshad Topkar (@hatopkar) March 5, 2024