Lady Police With Criminal: చూడ్డానికి హీరోయిన్‌లా ఉంది కానీ లేడీ విలన్ ఈ పోలీస్.. కారులో క్రిమినల్‌తో..

చూడ్డానికి హీరోయిన్‌లా ఉంది కానీ లేడీ విలన్ ఈ పోలీస్.. కారులో క్రిమినల్‌తో..

Lady Police With Criminal: చూడ్డానికి సినిమా హీరోయిన్ లా ఉంది.. కానీ వేసేవన్నీ విలన్ వేషాలు. రౌడీలతో కలిసి కారులోనే దుకాణం పెట్టేసింది. పోలీసుల కళ్ళు గప్పి ఇన్నాళ్లు పెద్ద నాటకం నడిపింది. ఆమె కూడా పోలీస్ శాఖలోనే పని చేస్తుంది. ఒకరోజు రౌడీతో కలిసి కారులో తప్పుడు పని చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. 

Lady Police With Criminal: చూడ్డానికి సినిమా హీరోయిన్ లా ఉంది.. కానీ వేసేవన్నీ విలన్ వేషాలు. రౌడీలతో కలిసి కారులోనే దుకాణం పెట్టేసింది. పోలీసుల కళ్ళు గప్పి ఇన్నాళ్లు పెద్ద నాటకం నడిపింది. ఆమె కూడా పోలీస్ శాఖలోనే పని చేస్తుంది. ఒకరోజు రౌడీతో కలిసి కారులో తప్పుడు పని చేస్తూ అడ్డంగా దొరికిపోయింది. 

రౌడీలు తప్పు చేస్తే పోలీసులు పట్టుకుని జైల్లో వేయాలి. కానీ ఈ లేడీ పోలీస్ మాత్రం రౌడీలతో చేతులు కలిపింది. చూడ్డానికి హీరోయిన్ లా ఉంది. తోటి పోలీసులు కూడా మంచి పోలీస్ అనే అనుకున్నారు. కానీ అందం వెనుక ఒక అందమైన అబద్ధం ఉందని తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. కారులో ఒక క్రిమినల్ తో కలిసి తప్పుడు పనులు చేస్తుంది. ఇన్ని రోజులూ పోలీసుల కళ్ళు కప్పి తిరిగిన ఈ లేడీ పోలీస్ ఎట్టకేలకు అడ్డంగా బుక్కైపోయింది. ఈ క్రమంలో ఆమె పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. యాక్షన్ మూవీని తలపించే సీన్ ఒకటి గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ లో చోటు చేసుకుంది. మహిళా హెడ్ కానిస్టేబుల్ నీతా చౌదరి ఆడిన హైడ్రామా పోలీసులను పరుగులు పెట్టించింది.   

గుజరాత్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై నిషేధం ఉంది. అయితే కొంతమంది పోలీసులు దీన్ని అదునుగా చేసుకుని అక్రమంగా మద్యం రవాణా చేస్తున్నారు. పోలీస్ వాహనాల్లో అయితే ఎవరూ పట్టుకోరని చెప్పి అందరి కళ్ళు కప్పి అక్రమంగా మద్యం తరలిస్తున్నారు. తాజాగా ఒక లేడీ కానిస్టేబుల్ అక్రమంగా మద్యం రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడింది. చెక్ పాయింట్ దగ్గర మద్యం రవాణా చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ లేడీ కానిస్టేబుల్ తో పాటు మద్యం మాఫియా నాయకుడు యువరాజ్ కూడా ఉన్నాడు. అతన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరూ సరుకు డెలివరీ చేయడం కోసం బచావ్ ప్రాంతం వైపు వెళ్తున్నారు. బచావ్ ప్రాంతంలో మద్యం స్మగ్లింగ్ జరుగుతుందని పోలీసులకు సమాచారం రావడంతో అలర్ట్ అయ్యారు.

ఆదివారం రాత్రి మద్యం లోడ్ దింపడానికి తెల్లని థార్ వాహనం బచావ్ వెళ్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. కుత్బుల్లాపూర్ పోలీసుల సహాయంతో జిల్లా మొత్తం బ్లాక్ చేయడం మొదలుపెట్టారు. అనుమానాస్పద వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. గంట సేపు చెకింగ్ చేసిన తర్వాత చోక్ డ్వా బ్లాక్ లో తెల్లటి రంగు థార్ వాహనం వేగంగా దూసుకొస్తుండడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఆపే ప్రయత్నం చేసినప్పటికీ ఆ వాహనం ఆగలేదు. చెక్ పాయింట్ దగ్గర రోడ్డు పక్కన ఉన్న పోలీసులు గొయ్యిలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. మిగతా పోలీసులు థార్ వాహనాన్ని వెంబడించారు.

యాక్షన్ సినిమాలో ఛేజ్ చేసినట్టు థార్ వాహనాన్ని వెంబడించి చివరికి ఒక చోట పోలీస్ వాహనాన్ని అడ్డంగా పెట్టి దాన్ని ఆపారు. ఆ తర్వాత కారు అద్దం దించగా లోపల లేడీ కానిస్టేబుల్ నీతా చౌదరి ఉండడంతో షాక్ అయ్యారు. అది కూడా మద్యం మాఫియా లీడర్ యువరాజ్ తో ఉండడం చూసి పోలీసులకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. యూనిఫామ్ ని అడ్డం పెట్టుకుని ఇలా అక్రమంగా మద్యం రవాణా చేస్తుందని పోలీసులు తెలిపారు. ఇద్దరి మీద కేసులు నమోదు చేశారు. యువరాజ్ మీద గతంలో ఒక హత్య కేసు కూడా నమోదైంది. చాలా కాలంగా పరారీలో ఉన్నాడు.

Show comments