Laapataa Ladies: సుప్రీంకోర్టులో 'లాపతా లేడీస్' సినిమా ప్రదర్శన! ఎందుకంటే..

సుప్రీంకోర్టులో ‘లాపతా లేడీస్’ సినిమా ప్రదర్శన! ఎందుకంటే..

Laapataa Ladies: ప్రేక్షుకలను ఎంటర్టైన్ చేసే వాటిల్లో సినిమాలు ఒకటి. అయితే కొన్ని సినిమాలు సందేశాత్మకంగా ఉంటూ అందరి హృదాయలను కొల్లగొడతాయి. అలాంటి ఓ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది.

Laapataa Ladies: ప్రేక్షుకలను ఎంటర్టైన్ చేసే వాటిల్లో సినిమాలు ఒకటి. అయితే కొన్ని సినిమాలు సందేశాత్మకంగా ఉంటూ అందరి హృదాయలను కొల్లగొడతాయి. అలాంటి ఓ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది.

ప్రజలకు వినోదాన్ని పంచే వాటిల్లో సినిమాలు ఒకటి. కొన్ని మూవీలు ఎంటర్టైన్ చేయడంతో పాటు మంచి సందేశాన్ని ఇస్తుంటాయి. మరికొన్ని సినిమాలు అయితే సమాజంలో జరిగే దారుణాలను, వివక్షతలను కళ్లకుగట్టినట్లు చూపిస్తుంటాయి. ఎన్నో సందేశాత్మక సినిమాలు అవార్డులను సైతం సొంతం చేసుకుని, ఏళ్లు గడిచిన ప్రేక్షకుల గుండెల్లో నిల్చిపోతాయి. ఇక ఏదైనా ప్రత్యేక సందర్భంగ వచ్చినప్పుడు మరోసారి వాటిని గుర్తు చేసుకుంటారు. అలానే ఓ బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాకు అరుదైన గౌరవం లభించింది. ఏకంగా సుప్రీంకోర్టులో ఆ సినిమాను ప్రదర్శించనున్నారు. మరి.. ఆ సినిమా ఏమిటి, సుప్రీంకోర్టులో ప్రదర్శించడానికి కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం….

భారత దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు 1950 జనవరి 28న ఏర్పాటు చేయబడింది. ఈ నేపథ్యంలోనే ఏడాది  75వ వార్షికోత్సవం పురస్కరించుకుని వజ్రోత్సవ వేడుకులను అత్యున్నత న్యాయస్థానం జరుపుకుంటుంది. దీంతో  నేడు కోర్టు ఆవరణంలోని ఆడిటోరియంలో బాలీవుడ్ చిత్రాన్ని  ప్రదర్శించనున్నారు. లాపతా లేడీస్ అనే చిత్రాన్ని సుప్రీంకోర్టులో ప్రదర్శన చేయనున్నారు. సుప్రీకోర్టు న్యామూర్తులు, రిజిస్ట్రీ సభ్యులు ఈ సినిమాను తిలకించనున్నారు. శుక్రవారం సాయంత్రం 4.15 గంటలకు ఈ సినిమాను వీక్షించనున్నారు. లింగ సమానత్వం అంశాన్ని ప్రధానంగా తీసుకుని లాపతా లేడీస్ సినిమాను తెరకెక్కించారు. అయితే సుప్రీంకోర్టులో ప్రదర్శంచే అవకాశం దక్కించుకున్న ఏకైక మూవీగా లాపతా లేడీస్ నిలిచింది.

ఇక శుక్రవారం సుప్రీకోర్టు ఆవరణంలో ప్రదర్శిస్తున్న ఈ సినిమాను , ప్రొడ్యూసర్, బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తో పాటు ఆ మూవీ డైరెక్టర్ కిరణ్ రావు కూడా హాజరు కానున్నారు. సమాజంలో జెండర్ ఈక్వాల్టీ అనే అంశంపై సుప్రీంకోర్టు చీప్ జస్టీస్ నొక్కిచెప్పడంలో భాగంగా ఈ సినిమా ప్రదర్శన జరగనుంది. సుప్రీంకోర్టు ఏర్పాటు జరిగి 75 ఏళ్లు అయిన సందర్భంగా వజ్రోత్సవ  కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లాపతా లేడీస్ సినిమా స్క్రీనింగ్ కి అవకాశం దక్కింది. రిజిస్ట్రీ అధికారులను కూడా ఈ మూవీని వీక్షించేందుకు ఆహ్వానించారు.

లాపతా లేడిస్ ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయినా  నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.  ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ఈ ఏడాది మార్చి 1న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాను కిరణ్ రావు, అమీర్ ఖాన్, జ్యోతి దేశ్ పాండే నిర్మించారు. ఈ చిత్రంలో నితాన్షి గోయేల్ , ప్రతిభా రంతా, స్పర్ష్ శ్రీవాస్తవ, ఛాయా కదమ్, రవి కిషన్ తదితరులు నటించారు. రామ్ సంపత్ ఈ చిత్రాన్నికి మ్యూజిక్ అందించారు. కొత్తగా పెళ్లైన ఇద్దరు గ్రామీణ ప్రాంతానికి చెందిన వధువు రైలు జర్నీలో తప్పిపోయిన సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

Show comments