Kolkata Doctor Issue-IMA Calls 24 Hours Nationwide Strike: నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్‌.. కారణమిదే

నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్‌.. కారణమిదే

Kolkata Doctor Issue-IMS, Strike: నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేస్తూ.. ఐఎంఏ పిలుపునిచ్చింది. మరి ఈ బంద్‌కు కారణం ఏంటంటే..

Kolkata Doctor Issue-IMS, Strike: నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు నిలిపివేస్తూ.. ఐఎంఏ పిలుపునిచ్చింది. మరి ఈ బంద్‌కు కారణం ఏంటంటే..

నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవల బందుకు పిలిపునిస్తూ.. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) నిర్ణయం తీసుకుంది. 24 గంటల పాటు వైద్య సేవలు నిలిపివేయాలని ఆదేశించింది. అనగా ఆగస్టు 17, శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం, ఆగస్టు 18 ఉదయం 6 గంటల వరకు.. దేశవ్యాప్తంగా వైద్య సేవల బందుకు ఐఎంఏ పిలుపునిచ్చింది. అత్యవసర సేవల మినహా మిగతా అన్ని వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రెండు రోజుల క్రితమే అనగా గురువారం నాడే.. దీనిపై ఐఎంఏ ప్రకటన చేసింది. 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండవని పేర్కొంది. మరి ఇంతకు ఐఎంఏ ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసుకుంది అంటే..

కోల్‌కతా ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో జూనియర్‌ రెసిడెంట్ డాక్టర్‌ హత్యాచార ఘటన యావత్‌ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. నిందితుడు అత్యంత పాశవికంగా ఆమెపై అత్యాచారానికి పాల్పడటమే కాక హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ దారుణానికి నిరసనగా దేశవ్యాప్తంగా 24 గంటల పాటు వైద్య సేవలను నిలిపివేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. అత్యవసర సేవల మినహా మిగతా అన్ని వైద్య సేవలు శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకూ నిలిపివేస్తున్నట్టు గురువారం రాత్రి ప్రకటించింది.

ఔట్‌ పేషెంట్‌, ఎంపిక చేసిన సర్జరీలు ఉండవని.. అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతాయని ఈ సందర్భంగా ఐఎంఏ స్పష్టం చేసింది. ‘‘వైద్య వృత్తి స్వభావం రీత్యా డాక్టర్లు ముఖ్యంగా మహిళా వైద్యులు దాడికి గురయ్యే అవకాశాలు అధికం. ఈ కారణంగా ఆసుపత్రులు, వాటి ప్రాంగణాల లోపల, వెలుపల వైద్యులకు అధికారులు భద్రత కల్పించాలి’’ అని ఐఎంఏ డిమాండ్‌ చేసింది. రాష్ట్ర శాఖలతో గురువారం జరిగిన సమావేశం అనంతరం ఐఎంఏ సేవల నిలిపివేత నిర్ణయాన్ని తీసుకుంది. అంతకు ముందు కోల్‌కతాలోని ఆర్‌జీ కర్‌ ఆసుపత్రిపై దుండగుల దాడికి పాల్పడటాన్ని కూడా ఐఎంఏ ఖండించింది.

ఇక ఐఎంఏ తీసుకున్న నిర్ణయంగా కారణంగా 24 గంటల పాటు వైద్య సేవలు నిలిచిపోవడంతో లక్షల మంది రోగులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. ఢిల్లీ ఎయిమ్స్, సఫ్దర్‌గంజ్‌లోని ప్రధాన ఆసుపత్రులకు చెందిన కొందరు వైద్యులు నిర్మాణ్‌ భవన్‌ వద్ద నిర్వహిస్తున్న ధర్నా ఐదో రోజుకు చేరింది. కోల్‌కతా హత్యాచార ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు గత వారం రోజుల నుంచి వివిధ రకాలుగా ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు, జూనియర్‌ వైద్యురాలిపై హత్యాచారానికి వ్యతిరేకంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. శుక్రవారం నాడు కోల్‌కతాలో ర్యాలీ నిర్వహించారు. నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. ఆదివారంలోగా నిందితుడ్ని ఉరేయాలని సీబీఐకి అల్టిమేటం జారీచేసిన మమతా.. లేదంటే తాను ధర్నాకు దిగుతానని హెచ్చరించారు.

Show comments